తెలంగాణ

రగులుతున్న మల్లన్న సాగర్ అందరికీ అదే ఆయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19:మల్లన్న సాగర్ ప్రాజెక్టు అధికార పక్షం, విపక్షం ఇద్దరికీ ఒకే ఆయుధం. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నాలుగు గ్రామాలకు సమస్య అయితే మూడు జిల్లాల్లో 20లక్షల ఎకరాలకు ప్రయోజనం కలిగించే అంశం. దీంతో అటు విపక్షాలు, ఇటు అధికార పక్షం తమ తమ రాజకీయ కోణాల్లో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళుతూ ఆందోళనలు సాగిస్తున్నాయి. ప్రాజెక్టు వల్ల ప్రయోజనం పొందే నల్లగొండ, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ రైతు సంఘాలు, రైతుల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ప్రాజెక్టును నిర్మించాలని డిమాండ్ చేశారు. తక్షణం ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టాలని, ముంపు బాధితులకు తగిన పరిహారం చెల్లించి గౌరవ ప్రదంగా జీవించే అవకాశం కల్పించాలని, రాజకీయ పక్షాల ఒత్తిడికి తల ఒగ్గవద్దని ప్రభుత్వాన్ని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపుగు గురయ్యే నాలుగు గ్రామాల ప్రజలు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గత రెండు వారాల నుంచి ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా ఏటిగడ్డకిష్టాపూర్‌లో పరిస్థితి ఉద్రిక్తతగా ఉంది. మీడియాపై రెండు సార్లు దాడి కూడా చేశారు. మరోవైపు ప్రాజెక్టును నిర్మించాలని ఉత్తర తెలంగాణకు వరప్రసాదం లాంటి ఈ ప్రాజెక్టును అడ్డుకోవద్దు అంటూ పలు రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. నల్లగొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల రైతులకు ప్రయోజనం కలిగించే ఈ ప్రాజెక్టును సత్వరం నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈ మూడు జిల్లాల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ఆందోళనలు చేస్తూ ఆయా ప్రాంతాల్లో ఆర్‌డిఓలకు వినతిపత్రాలు అందజేశారు. ఆదివారం నాడు హైదరాబాద్‌లోని సదస్సు నిర్వహించారు. ఈ మూడు జిల్లాలకు చెందిన రైతు నాయకులు, రైతులు, వివిధ వర్గాలకు చెందిన వారు పాల్గొన్నారు. ప్రాజెక్టును అడ్డుకోవడం తగదని తక్షణం ప్రాజెక్టును నిర్మించాలని డిమాండ్ చేశారు. నాలుగు గ్రామాల్లో రైతుల ఆందోళన తొలుత ఆ నాలుగు గ్రామాలకే పరిమితం అయింది. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌తో పాటు సిపిఐ, సిపిఎం డిమాండ్ చేయగా, ముంపు బాధితులకు అండగా ఉద్యమిస్తామని కాంగ్రెస్, టిడిపి నాయకులు ప్రకటించిన విషయం విదితమే. కాగా, ఈ అంశాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని అధికార పక్షం నిర్ణయించుకుంది. దేశంలో ఎవరూ ఇవ్వని విధంగా ముంపు బాధితులకు పరిహారం చెల్లిస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం విపక్షాలు రైతులను నష్టపరుస్తున్నారని ఆయన విమర్శించారు.
ఈ ప్రాజెక్టును నిర్మించాల్సిందేనని నల్లగొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులంతా డిమాండ్ చేస్తుండటంతో ఆ జిల్లాలకు చెందిన విపక్షాల నాయకులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పార్టీ నిర్ణయం మేరకు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించాలో, జిల్లాకు ప్రయోజనం కలుగుతుందని స్వాగతించాలో అర్ధం గాక గందరగోళంలో చిక్కుకుకుని ప్రాజెక్టు అనుకూల ఉద్యమానికి దూరంగా ఉంటున్నారు. 50 టిఎంసిల నీటి నిల్వ సామర్ధ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 20 వేల ఎకరాలకు నీరు లభిస్తుందని, ఆత్మహత్యలు లేని తెలంగాణను సాకారం చేయాలంటే మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం అనివార్యం అని మంత్రులు వాదిస్తున్నారు.
అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు
తెలంగాణ రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో హెచ్‌సియు ప్రొఫెసర్ రాఘవరెడ్డి, ప్రకాశ్ తదితరులు మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టును అడ్డుకోవద్దని హెచ్చరించారు. రైతు సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు సైతం సదస్సులో పాల్గొని బీడు భూములకు నీళ్లు పారించే ప్రయత్నాలను అడ్డుకోవద్దని అన్నారు. ప్రాజెక్టును అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని రైతు నాయకులు హెచ్చరించారు.

నిర్వాసితుల దీక్షలు భగ్నం

పలువురి అరెస్టు ౄ సంగారెడ్డిలో నిరసన ౄ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

సంగారెడ్డి టౌన్, జూన్ 19: నిమ్జ్, మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ గత మూడు రోజులుగా కలెక్టరేట్ ముందు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలను ఆదివారం మధ్యాహ్నం పోలీసులు భగ్నం చేశారు. సంగారెడ్డి రూరల్ సిఐ నరేందర్, ఎస్‌ఐ శివలింగం తమ బలగాలతో మోహరించి ఆమరణ దీక్ష చేస్తున్న సిపిఎం కార్యదర్శి ఎ.మల్లేశంతో సహా నిమ్జ్ భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షులు రాంచందర్, మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షులు భాస్కర్, రమేష్‌లను అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు. దీక్ష శిబిరం వద్దనున్న 18మందిని అరెస్టు చేసి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీక్ష భగ్నాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి కొత్త బస్టాండ్ ముందు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాన్ని అణిచి వేయలేరని, అక్రమంగా రైతుల నుంచి భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదన్నారు. యేడాదికి రెండు పంటలు పండే సారవంతమైన భూములు తీసుకోవడం దారుణమన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రజాస్వామ్యబద్ధంగా దీక్షలు చేస్తుంటే అరెస్టులు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు స్వస్తి పలకాలని హితువుపలికారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగేంతవరకు సిపిఎం అండగా ఉంటుందన్నారు.