తెలంగాణ

నగరంలో వర్ష బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇద్దరు మృతి చెందారు. నగరంలోని పలుచోట్ల గాలివాన బీభత్సం సృ ష్టించింది. లాల్‌బాహదూర్ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ టవర్ కుప్పకూలింది. టవర్ రోడ్డు మీద పడటంతో దాని కింద చిక్కుకున్న ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో పలు కార్లు ధ్వంసం కాగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎల్‌బీ స్టేడియంలోని టవర్ కుప్పకూలిన ఘటనలో జీఎస్‌టీలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం మరణించగా, మరొకరు ఎం.రమేష్ కాలు విరిగింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి టవర్ కూలిన ప్రాంతాన్ని సందర్శించారు. అదే విధంగా ఛాదర్‌ఘాట్ పోలీస్టేషన్ పరిధిలోని శంకర్‌నగర్ కాలనీలోని ఐదేళ్ల వయసు కలిగిన మణికంఠ అడుకుంటుండగా ఓ పెంట్‌హౌస్ కప్పు మీద పడి మృతి చెందాడు.

చిత్రం... సుబ్రహ్మణ్యం మృతదేహం వద్ద మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి తదితరులు