తెలంగాణ

ప్రస్తుతానికి పార్టీ మారడం లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: పార్టీ మారుతున్నట్టు జరగుతోన్న ప్రచారంపై ఎన్నిసార్లు ఖండించిన నమ్మడం లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వాపోయారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, అయితే భవిష్యత్‌లో ఏమి జరుగుతుందనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. గాంధీభవన్‌లో జగ్గారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌లో చేరడానికి తనంతకు తానుగా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల బలం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ మర్రిచెట్టులాంటిదన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినా పరిషత్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉండదని జగ్గారెడ్డి అన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ఘోరమైన తప్పు చేందన్నారు. సీఎం కేసీఆర్ స్పందించి బోర్డు అధికారులను సస్పెండ్ చేసి ఉంటే బాగుండేదన్నారు. సీఎం స్పందించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎలాంటి విమర్శలు చేయలేదన్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు హరీశ్‌రావు చేసిన తప్పులనే ఎత్తిచూపుతున్నానని అన్నారు.