తెలంగాణ

దొరా.. ఐదు రోజుల తర్వాత గుర్తొచ్చిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇంటర్మీడియట్‌లో తప్పిదాలు జరిగి 17 మంది విద్యార్థుల చావుకు ప్రభుత్వమే కారణం అయ్యిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి అన్నారు. గురువారం ఇంటర్మీడియట్‌లో వైఫల్యాలపై కాంగ్రెస్ చేపట్టిన వరంగల్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో ప్రసంగించారు. ఇంటర్ వైఫల్యాలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రి కేసీ ఆర్ బయటకు రావడానికి ఐదు రోజులు పట్టిందా దొర అంటూ ఎద్దేవా చేశారు. అసలు విద్యార్థులను ఏం చేద్దామనుకుంటున్నావు అని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో సీఎం కేసీఆర్ ఆటలు అడుకుంటున్నారని ఆమె మండి పడ్డారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ఇప్పటి వరకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా రివాల్యుయేషన్ అని చేతులు దులుపుకొన్నాడని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థుల పట్ల సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిని ఆమె తీవ్రంగా తప్పు పట్టారు. ఇక తెలంగాణలో నీ ఆటలు సాగవు దొరా.. అంటూ హెచ్చరించారు. ఇంటర్ వైఫల్యాల సంఘటన నేపధ్యంలో కేసీఆర్‌కు సీఎం కుర్చులో కూర్చునే అర్హత లేదన్నారు. ఇంటర్మీడియట్ సంఘటన వెనుక ఎవ్వరు ఉన్నారో బయటపెట్టాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. విద్యార్థులు ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకొవద్దని, విద్యార్థులంతా ధైర్యంగా ఉండాలని కోరారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ మీ వెంట ఉంటుందని న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పారు. ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి రాజీనామ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనడంలో బిజీగా ఉన్న ముఖ్యమంత్రికి విద్యార్థుల సమస్యలను పరిష్కరించే తీరికా లేకుండా పోయిందా? అని ఆమె ప్రశ్నించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అయిన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెపుతారని ఆమె అన్నారు. మాజీ మంత్రి కొండా సురేఖ, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీ్ధర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఉద్రిక్తత
ఇంటర్ వైఫల్యాలను నిరసిస్తూ వరంగల్‌లో కాంగ్రెస్ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టరేట్ వైపు ర్యాలీగా దూసుకెళ్తున్న కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకొన్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయనర్ విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖతో పాటు ముఖ్య నేతలను అరెస్ట్ చేసి పోలీస్ వాహనాలలో ఎక్కించి సిటీకి దూరంగా హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

చిత్రాలు.. ధర్నాలో మాట్లాడుతున్న విజయశాంతి *విజయశాంతిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు