తెలంగాణ

టీఆర్‌ఎస్ బీఫాం కోసం పెట్రోల్ పోసుకొని ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాపూర్, ఏప్రిల్ 25: నాగర్ కర్నూల్ జిల్లాలో జరుగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో కొల్లాపూర్ మండలం కుడికిళ్ల గ్రామంలో ఎంపీటీసీ స్థానానికి ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారికే టీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ కార్యకర్తలు కొంతమంది ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఇంటిముందు పెట్రోలు పోసుకొని ఆందోళనకు దిగారు. గురువారం ఇక్కడి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఇంటిదగ్గర కుడికిళ్లకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వచ్చి కుడికిళ్లకు చెందిన వ్యక్తికే జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానానికి మాజీ మంత్రి జూపల్లి వర్గీయులకే బీఫాం కేటాయించారని, మొదటి నుంచి మిమ్మలను నమ్ముకొని పనిచేసిన మాకు కుడికిళ్లకు చెందిన వారికి ఒక్కరికైనా బీఫాం ఇవ్వకపోతే మేము మీ వెంట ఉండి ఏమి లాభమని ఎమ్మెల్యేను నిలదీస్తూ ఆ గ్రామానికి చెందిన కొండ్ర బిచ్చయ్య, బంగారయ్య, అర్జున్, వెంకటస్వామి తదితరులు పెట్రోలు పోసుకొని నిప్పంటించకోవడానికి ప్రయత్నించగా తోటి కార్యకర్తలు నీళ్లు చల్లి వారికి నచ్చ చెబుతుండగా హుటాహుటీన ఎస్సై వెంకట సత్యనారాయణ, పోలీసులు తరలివచ్చారు. పరిస్థితులను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఐదుమంది కార్యకర్తలను ఇంట్లోకి పిలుచుకొని అధిష్టానం మాట మనం వినాలని, వీలైనంత వరకు మార్పులు, చేర్పులు ఉంటే మీకు తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీనితో కార్యకర్తలు మెత్తబడ్డారు. పరిస్థితులు అదుపులోకి రావడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
చిత్రం... ఎమ్మెల్యే ఇంటిముందు పెట్రోల్ సీసాలతో ఆందోళన చేస్తున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు