తెలంగాణ

ఇంటర్ వైఫల్యంపై సీఎం క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఏప్రిల్ 25: ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వం వైఫల్యంతో లక్షలాది మంది విద్యార్థుల ఆందోళనకు గురవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీనికి సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ రాష్టవ్య్రాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా గురువారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట డీసీసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం ఘెరంగా విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం, బోర్డు అధికారుల నిర్వాకంతో ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. ఇంటర్ ఫలితాల వెల్లడిలో నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇరవైమందికి పైగా విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులవి ఆత్మహత్యలు కావని ప్రభుత్వ హత్యలనని ఆయన అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పాతికలక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లింలని ఆయన డిమాండ్ చేశారు. మూల్యంకనం, ఫలితాల వెల్లడిలో ఇంటర్‌బోర్డు తప్పిదాలు చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమడుతుందన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు మాత్రమే కాకుండా పరీక్షలు రాసిన వారందరికీ రీవాల్యూయేషన్ ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తక్షణమే బర్తరఫ్ చేయాలని కోరారు. ఇంటర్ విద్యార్థులందరికీ న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌పార్టీ అండగా ఉంటుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న ఇంటర్ పరీక్ష ఫలితాల్లో తప్పిదాలు జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఈ తప్పిదాలపై సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించలేదని, రాష్ట్ర వ్యా ప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తడంతో అధి కారులతో సమావే శమయ్యా రని గుర్తుచేశారు. ఇంటర్ పరీక్ష ఫలితాల్లో జరిగిన పొరపాట్లకు కారణమైన అధికారులు, ప్రైవేటు సంస్ధపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్‌బోర్డు తప్పిదాలతో ఒక్క విద్యార్ధి నష్టపోకుండా చూడాలన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అండగా ఉండి కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో ఉమ్మడి జిల్లా డీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర్‌రావు, నాయకులు బైరు వెంకన్నగౌడ్, అయూబ్‌ఖాన్, అంజద్‌ఆలీ, షాహీన్‌భేగం, కుమ్మరికుంట్ల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...సూర్యాపేట కలెక్టరేట్ వద్ద ధర్నాలో ప్రసంగిస్తున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి