తెలంగాణ

సీఎం ‘కోడ్’ ఉల్లంఘన: కాంగ్రెస్ ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: పరిషత్ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా రాష్ట్రప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అధికారులతో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ వివరాలను టీపీసీసీ ఎన్నికల సంఘం సమన్వయ కమిటీ కన్వీనర్ జీ నిరంజన్ వెల్లడించారు. తాము అభివృద్ధికి అడ్డం కాదని, అయితే ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఎన్నికల సంఘం రాష్ట్రప్రభుత్వానికి తగిన సలహాలు ఇవ్వాలని ఆయన కోరారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మార్చి 20వ తేదీన మెట్రో రైలు మార్గాన్ని గవర్నర్ ప్రారంభించారన్నారు. బంగారు తెలంగాణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి పుస్తకాన్ని ఉగాది పండగ రోజు విడుదలచేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక విభాగాన్ని రాష్ట్రప్రభుత్వ అధికారి ప్రారంభించారని చెప్పారు. రెండో పంపు ట్రయల్ రన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రారంభించారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాలను అధికార పార్టీ తరఫున వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ ప్రయోజనాలకు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఒక రోజు ముందు రైతు బంధు స్కీం కింద రూ.4వేలను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని ఆరోపించారు.