తెలంగాణ

స్టార్టప్‌ల వృద్ధికి స్మార్ట్‌సిటీ ప్రొగ్రాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: స్టార్టప్‌ల అభివృద్ధి కేంద్రం ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టు ఉపయోగపడిందని, తెలంగాణ రాష్ట్రం రూపకల్పన చేసిన టీ హబ్‌కు దేశ వ్యాప్తంగా మంచి స్పందన లభించిందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. గురువారం ఇక్కడ స్మార్ట్ సిటీ స్టార్టప్‌ల అంశంపై స్మార్ట్ సిటీస్ మిషన్, అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి అయోగ్ నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్మార్ట్ సిటీస్ అంటే ఆకర్షణీయ నగరాల్లో రవాణా, వ్యర్థ పదార్థాల యాజమాన్యం, మంచి నీరు, ఇంటెలిజెంట్ హౌసింగ్, స్మార్ట్ డిజిటల్ వౌలిక సదుపాయాలు, పర్యావరణం, సమ్మిళితమైన అభివృద్ధి అంశాలపై దృష్టిని కేంద్రీకరించామన్నారు. వీటికి సంబంధించి ప్రణాళికలు రూపొందించామన్నారు. వినూత్నమైన స్టార్టప్‌లను అనేక సమస్యల పరిష్కారానికి నాంది పలికే విధంగా రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. పట్టణాల్లో సుపరిపాలన, పౌరసేవలకు స్టార్టప్‌ల ద్వారా అద్భుతమైన పరిష్కారాలు రూపొందించామన్నారు. ఈ రంగంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్ స్టార్టప్‌లు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. భాగస్వామ్య పద్ధతిలో ఆకర్షణీయ నగరాల అభివృద్ధికి ముందడుగు వేయాలని స్పష్టం చేశారు. కార్పొరేట్లు, స్టార్టప్‌ల కోసం ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. టీ హబ్ సీఈవో రావి నారాయణ్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి ఉన్నత ప్రమాణాలతో స్మార్ట్ సిటీస్‌ను అభివృద్ధి చేయాలన్నారు. నీతి ఆయోగ్, అటల్ ఇన్నోవేషనన్ మిషన్‌ల వల్ల స్మార్టప్‌ల రంగానికి ఊపు వచ్చిందన్నారు. స్మార్ట్ సిటీస్ మిషన్ జాయింట్ సెక్రటరీ కునాల్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో నగరాలు జీడీపీలో 70 శాతం, రెవెన్యూలో 90 శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్నాయన్నారు.