తెలంగాణ

తెలంగాణలో కొత్త జిల్లాలు 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాల సంఖ్య 14కంటే ఎక్కువ చేయడం కుదరదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సిబ్బంది, వౌలిక సదుపాయాలపై నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మార్గనిర్దేశం చేశారు. అవసరమైనచోట రెవిన్యూ డివిజన్లు, మండలాలను పెంచుకోవచ్చు. కానీ మొత్తం జిల్లాల సంఖ్య మాత్రం 24-25 మధ్యనే ఉంటుందని రాజీవ్ శర్మ స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై సచివాలయంలో కలెక్టర్లతో సోమవారం సిఎస్ రాజీవ్‌శర్మ సమీక్షించారు. ఒక్కో జిల్లా మూడుగా ఏర్పడేచోట ప్రస్తుత సిబ్బంది సరిపోరని, అయితే రెండు జిల్లాలు ఏర్పడేచోట మాత్రం సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాల్సిందిగా రాజీవ్ శర్మ సూచించారు. రెండు జిల్లాలు ఏర్పడే జిల్లాల్లో అదనంగా సిబ్బందివుంటే ఆ జాబితాను విడిగా అందజేయాలని ఆదేశించారు. జిల్లాలవారీగా అవసరమైన అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఎంతమంది అవసరమవుతారో అధ్యయనం చేసి ప్రభుత్వానికి వెంటనే నివేదిక ఇవ్వడానికి భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ చైర్మన్‌గా సాధికారిక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు రాజీవ్ శర్మ వెల్లడించారు. ఈ కమిటీ త్వరలో అన్ని శాఖలకు చెందిన శాఖాధిపతులు, సంబంధిత ముఖ్య కార్యదర్శులతో సమావేశం అవుతుందని వివరించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలు దాదాపు రెవిన్యూ డివిజన్ కేంద్రాలుగా ఉన్నవేనని, అక్కడి ఆర్డీవో కార్యాలయాలనే కలెక్టరేట్లుగా ఏర్పాటు చేయాలని రాజీవ్ శర్మ సూచించారు. అయితే కొన్నిచోట్ల ఆర్డీవో కార్యాలయాలు కొనసాగుతున్న భవనాలు కలెక్టరేట్లు ఏర్పాటు చేయడానికి అనుకూలంగా లేవని కలెక్టర్లు వివరించగా, అలాంటిచోట అద్దె భవనాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు వచ్చిన సరిహద్దులో ఉన్న కొన్ని మండలాలు భౌగోళిక స్వరూపం కారణంగా పొరుగు జిల్లాల్లోకి వెళ్లే అవకాశం ఉందని, అలాంటి మండలాలు, గ్రామాల ప్రజల నుంచి ఇటీవల జరిగిన గ్రామ సభల్లో ప్రజా అభిప్రాయ సేకరణ జరపినట్టు కలెక్టర్లు వివరించారు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న వరంగల్ జిల్లా భూపాలపల్లి జిల్లాల్లో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు ఆ జిల్లా కలెక్టర్ సిఫారసు చేయగా, అలాగే అదే జిల్లాలోని ఇల్లంతకుంటను మొదట కొత్తగా ఏర్పాటు చేయబోయే సిద్ధిపేట జిల్లాలో కలపాలని చేసిన సిఫారసును మార్పు చేసి సిరిసిల్ల జిల్లాలో చేర్చడానికి ప్రజలు సముఖంగా ఉన్నట్టు తాజాగా నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. అత్యధిక మండలాలు కలిగిన మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రస్తుతం 64 మండలాలు ఉండగా, ఆ జిల్లాల్లో మండలాల సంఖ్యను 10-15 వరకు అదనంగా పెంచుకోవడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల, వరంగల్ జిల్లా జనగామను జిల్లాలుగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ప్రబలంగా ఉందని కలెక్టర్లు వివరించగా, ప్రస్తుతం 24-25 జిల్లాల వరకే పరిమితం కావాల్సిందిగా ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని, ఈ రెండు జిల్లాలను తాజాగా ప్రతిపాదిస్తే జిల్లాల సంఖ్య 26-27కు పెరిగే అవకాశం ఉంటుందని, జిల్లాల సంఖ్య 24 కంటే ఎక్కువ ఏర్పాటయ్యే అవకాశం దాదాపు లేనట్టేనని రాజీవ్ శర్మ స్పష్టం చేసినట్టు తెలిసింది.

కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాలు, వౌలిక వసతులు, సిబ్బంది తదితర అంశాలపై సమగ్రమైన నివేదికలు ఈ నెలాఖరులోగా సిసిఎల్‌ఎ కమిషనర్‌కు అందచేయాలని, వీటిపై జూలై 5వ తేదీన ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని రాజీవ్ శర్మ స్పష్టం చేసినట్టు తెలిసింది.
కొత్త జిల్లాల జాబితాలో చేరిన సిరిసిల్ల
కొత్త జిల్లాల జాబితాలో తాజాగా కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు అవకాశం లభించింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ అందజేసిన నివేదికలో సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై ప్రతిపాదన అందినట్టు తెలిసింది. కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన పంపాల్సిందిగా ముఖ్యమంత్రి చేసిన సూచించిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా కలెక్టర్ల నుంచి అందిన నివేదిక మేరకు రాష్ట్రంలో అత్యధిక విస్ణీర్ణం కలిగిన జిల్లాగా ఆదిలాబాద్ జిల్లా కోమరం భీం జిల్లా అవతరించనుండగా, అత్యధిక మండలాలు కలిగిన జిల్లాగా వరంగల్ జిల్లా నిలువనున్నట్టు సమాచారం.