తెలంగాణ

జైపూర్‌లో రెండో థర్మల్ ప్లాంట్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గోదావరి ఖని, జూన్ 21: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రంలోని రెండవ యూనిట్‌లో బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పాదన ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని, జూలై రెండో వారంలో 600 మెగావాట్ల సామర్థ్యానికి తీసుకురావాలని సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ ఆదేశించారు. మంగళవారం ఆయన థర్మల్ కేంద్రంలోని రెండు ప్లాంట్లను సందర్శించి అధికారులు, నిర్మాణ సంస్థలతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి శ్రీ్ధర్ మాట్లాడుతూ ఈనెల ఒకటి నుంచి మొదటి ప్లాంటులో బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పాదన సజావుగా సాగడంపై హర్షం వ్యక్తం చేశారు. జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు 40 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి జరిగిందని, రెండో ప్లాంట్‌లో కూడా ఈ నెలాఖరు వరకు బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పాదన ప్రక్రియ కొనసాగించాలని ఆయన ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో సింగరేణి తన వంతు బాధ్యతగా ఈ విద్యుత్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. సిఎం చేతుల మీదుగా జూలై చివరి వారంలో సింగరేణి విద్యుత్‌ను రాష్ట్రానికి అంకితం చేయాలని యోచిస్తున్నామని చైర్మన్ తెలిపారు.