తెలంగాణ

2013 చట్ట ప్రకారం పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూన్ 21: వ్యవసాయ రంగానికి కావల్సిన సాగునీటిని అందించడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని స్వార్థ రాజకీయాల కోసం ప్రతిపక్ష పార్టీలు నిర్వాసితులను రెచ్చగొడుతున్నాయని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులు నిర్మించి తీరుతామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఉద్ఘాటించారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, 123 జివోపై చర్చకు కూడా సిద్ధమేనంటూ సవాల్ చేసారు. మంగళవారం సాయంత్రం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదని వారిని అన్ని రకాలుగా న్యాయం చేయడానికి సర్కారు సుముఖంగా ఉందన్నారు. ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదంటూనే ప్రతిపక్ష పార్టీలు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నాయని, భూ సేకరణ లేనిదే ప్రాజెక్టులను ఏలా నిర్మిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేసారు. భూ నిర్వాసితులకు అన్ని వసతులతో కూడిన గ్రామాలను నిర్మించడంతో పాటు ప్రాజెక్టులో చేపలు పట్టుకోవడానికి అవకాశం కల్పిస్తామని, ఇతర పథకాల్లో కూడా ప్రాధాన్యత కల్పిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. సిఎం కెసిఆర్ కూడా ముంపు బాధితుడేనని, భూములు కోల్పోతే పడే బాధలు ఏమిటో సిఎంకు తెలుసన్నారు. 123 జివో ప్రకారం మెరుగైన పరిహారం ప్రభుత్వం అందిస్తుందన్నారు.
ప్రతిపక్ష పార్టీలు రైతుల మేలుకోరి మాట్లాడుతున్నాయా లేక ముంచడానికి మాట్లాడుతున్నాయో అర్థం కావడం లేదన్నారు. 2013 చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తే రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని, ప్రస్తుతం అక్కడున్న భూముల మార్కెట్ ధర 60 వేలుందని, మూడు రెట్లు కట్టించినా 1.80 లక్షలకు మించదని, 123 జివో ప్రకారం మొత్తం 7 లక్షల వరకు పరిహారం అందుతుందని స్పష్టం చేసారు. బాధితులు ఇళ్లు ఖాళీ చేయడానికి 20 రోజుల ముందే పరిహారం డబ్బులు ఇళ్ల ముందుంటాయని, చట్ట ప్రకారం వెళితే 6 మాసాలైనా డబ్బులు చేతికందవన్నారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని రైతులు నమ్మకుండా చర్చలకు రావాలని పిలుపునిచ్చారు.