తెలంగాణ

సీట్లు, ఫీజుల కోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో గణనీయంగా సీట్ల కోత విధించడంపై యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీట్ల కోతతో సతమతమవుతున్న యాజమాన్యాలకు ఫీజుల్లో కూడా కోత పడటం జీర్ణించుకోలేకపోతున్నాయి. కొన్ని కాలేజీల్లో పరిస్థితులకు అనుగుణంగా చూస్తే కనీస ఫీజు 35వేల రూపాయలు సైతం ఖరారు చేసే అవకాశం లేదని ఎఎఫ్‌ఆర్‌సి స్పష్టం చేయడంతో కాలేజీల యాజమాన్యాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. సీట్ల తగ్గింపు, ఫీజుల తగ్గింపుపై న్యాయస్థానాలను ఆశ్రయించాలని యోచిస్తున్నాయి. ఇంత తక్కువ ఫీజులతో తాము కాలేజీలను నడపడం సాధ్యం కాదని తేల్చి చెబుతున్నాయి. ఆంధ్రాలో అటు తెలంగాణలో కలిపి గతంలో 718 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిలో 3,40,099 సీట్లు ఉండేవి. ఇందులో ఎపిలో 368 కాలేజీల్లో 1,73,634 సీట్లు, తెలంగాణలో 266 కాలేజీల్లో 1,26,468 సీట్లు విభజనలో వచ్చాయి. తెలంగాణలో 95000సీట్లకు కుదించే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణలోని 266 కాలేజీల్లో 30 వరకూ అత్యుత్తమ కాలేజీలు పనిచేస్తున్నాయి. తెలంగాణలో 19 యూనివర్శిటీ, కానిస్టిట్యూయెంట్ కాలేజీలున్నాయి. ఇవి కాకుండా మరో 30వరకూ అన్ ఎయిడెడ్ కాలేజీలు ప్రైవేటు కాలేజీలు మంచివి పనిచేస్తున్నాయి. ప్రధానంగా జెఎన్‌టియు, జెఎన్‌టియు కానిస్టిట్యూయెంట్ కాలేజీలు, ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ, సిబిఐటి, ఎంజిఐటి, విఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి, గోకరాజు రంగరాజు, సివిఆర్, అనురాగ్, సివిఆర్‌హెచ్, వాసవి, బివి రాజు ,డక్కన్ కాలేజీ, ఎంవిఎస్‌ఆర్, నారాయణమ్మ, కేశవ మెమోరియల్, మాతృశ్రీ, జెబిఐఇటి, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు సహా ఈ జాబితా చాలా పెద్దదే ఉంది. వీటిలో సైతం సీట్లు కోత, ఫీజుల కోత విధిస్తున్నట్టు సమాచారం. జాబితా బుధవారం తేలనుంది.