తెలంగాణ

ఎన్టీపిసితో పిపిఏ ముసాయిదా ఒప్పందాన్ని సవరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: రామగుండంలో నిర్మించతలపెట్టిన ఎన్టీపిసి 4000 మెగావాట్ల కెపాసిటీ విద్యుత్ ప్లాంట్ నుంచి తెలంగాణ డిస్కాంలు 1600 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుపై సమర్పించిన ముసాయిదా ఒప్పందాలను పునస్సమీక్షించి, సవరించి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశించింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా రెండు డిస్కాంలు, ఎన్టీపిసి తాజాగా సవరించిన ముసాయిదా ప్రతులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ ప్రతిపాదనలపై టిఎస్‌ఇఆర్‌సి చైర్మన్ ఇస్మాయిల్ అలీ ఖాన్, సభ్యులు హెచ్ శ్రీనివాసులు, ఎల్ మనోహర్ రెడ్డి అభ్యంతరాలు తెలిపారు. మినిమమ్ ఆల్టర్‌నేట్ ట్యాక్స్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను ఫిక్స్‌డ్ వ్యయంలో చేర్చడంపై అభ్యంతరాలను కమిషన్ వ్యక్తం చేసింది. దీనివల్ల పిపిఏ అమలులో ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రప్రజలపై వెయ్యి కోట్ల రూపాయల భారం పడుతుందని కమిషన్ పేర్కొంది. కొన్ని క్లాజులను తొలగించాలని కమిషన్ సూచించింది.