తెలంగాణ

జనం మీద 1500 కోట్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: వచ్చే జూలై 1వ తేదీ నుంచి సవరించిన విద్యుత్ చార్జీలు అమలులోకి వస్తున్నాయి. దీని వల్ల వినియోగదారులపై రూ.1500 కోట్ల భారం పడనుంది. మొత్తం 86 లక్షల గృహ వినియోగదారుల్లో 60 లక్షల మందికి చార్జీల ప్రభావం ఉండదు. కాని 100 నుంచి 200 యూనిట్ల స్లాబ్‌లో తొలి వంద యూనిట్లకు రూ.3.25 పైసలు, 101-200 యూనిట్ల మధ్య రూ. 4.25 పైసలు, 200-400 యూనిట్ల శ్లాబ్‌లో తొలి రెండు వందల యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 4.80 పైసలు, 201-400 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.8.15 పైసలు, 400 యూనిట్లపైన కేటగిరీలో ప్రతి యూనిట్‌కు రూ. 9.50 పైసలు చొప్పున వసూలు చేసే ప్రతిపాదనను టిఎస్‌ఇఆర్‌సి దాదాపు ఆమోదించినట్లు సమాచారం. వంద యూనిట్లపైన విద్యుత్ వినిమయం చేసే వినియోగదారులు 26 లక్షల మంది ఉన్నారు. మొత్తం 8.1 శాతం వరకు విద్యుత్ చార్జీలను పెంచేందుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెవెన్యూ లోటు రూ. 1958 కోట్లు ఉండగా, రాష్ట్రప్రభుత్వం రూ. 1500 కోట్ల వరకు చార్జీలు పెంచేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. టిఎస్‌ఇఆర్‌సి శుక్రవారం చార్జీల వివరాలను అధికారికంగా ప్రకటించనుంది.