తెలంగాణ

డ్రగ్స్ కేసు కథ కంచికేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: సినీరంగ ప్రముఖుల మాదక ద్రవ్యాల కేసు కంచికి చేరినట్టే ఉంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారిని ఏ స్థాయిలో ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీరాలు పలికిన దర్యాప్తు అధికారుల హెచ్చరికలు ఉత్తుత్తి మాటలేనని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెస్ బయట పెట్టింది. తెలుగు రాష్ట్రాలు, సిసిమా పరిశ్రమలో సంచలనం రేపిన మాదక ద్రవ్యాల కేసుపై సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలను ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెస్ వ్యవస్థాపకుడు పద్మనాభరెడ్డి మంగళవారం మీడియాకు వివరించారు. ఈ కేసును ఎక్సైజుశాఖ నీరు గార్చినట్టు తేలిపోవడంతో అవినీతి నిరోధకశాఖ లేక విజిలెన్స్ కమిషన్ ద్వారా దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం సమర్పించినట్టు ఆయన తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు అధికారుల లొసుగులను చూస్తే రాష్ట్రంలో పెద్దలకో న్యాయం, పేదలకో న్యాయమన్నట్టుగా ఉందని పద్మనాభరెడ్డి దుయ్యబట్టారు. మాదక ద్రవ్యాల కేసుతో సంబంధం ఉన్న సినీ ప్రముఖుల నుంచి రక్త నమూనాలు, గోర్లు, వెంట్రుకలను సేకరించి ల్యాబ్‌కు పంపించినట్టు గతంలో దర్యాప్తు అధికారులు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరి సేకరించిన నమూనాలు ఏమయ్యాయని పద్మనాభరెడ్డి ప్రశ్నించారు. మాదక ద్రవ్యాల కేసులో మొత్తం 12 కేసులు నమోదు చేసి కేవలం నాలుగు కేసులకే చార్జిషీట్ దాఖలు చేసినట్టు తాను సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారంలో వెల్లడైందని ఆయన వివరించారు. మాదక ద్రవ్యాలను విక్రయించిన వ్యక్తి, ఇవెంట్ మేనేజర్‌పైనే చార్జిషీట్‌లో పేర్కొని, సినీ ప్రముఖులను కేసు నుంచి తప్పించారని పద్మనాభరెడ్డి ఆరోపించారు. మాదక ద్రవ్యాలను సరఫరా చేసిన వారే నేరస్తులు కాదని, వాటిని వినియోగించిన వారు కూడా నేరస్తులేనని ఆయన గుర్తు చేశారు. ఈ కేసు దర్యాప్తును డీఐజీ, అడిషనల్ డీజీ స్థాయి అధికారులతో సిట్ ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా, దర్యాప్తు చేసింది మాత్రం ఎక్సైజు ఇన్స్‌పెక్టరేనని ఆయన తెలిపారు. ఈ కేసుపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఇదే నిదర్శనమని ఆయన విమర్శించారు.
దర్యాప్తు కొనసాగుతుంది: అకున్ సబర్వాల్
మాదక ద్రవ్యాల కేసు నీరుగారినట్టు వచ్చిన ఆరోపణలపై గతంలో ఎక్సైజుశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా పని చేసిన అకున్ సబర్వాల్ స్పందించారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా పురోగతిలో ఉందని ఆయన పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం తాజా సమాచారం కాదని ఆయన ఖండించారు.