తెలంగాణ

బీజేపీ గెలుపు తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పెద్ద మెజార్టీతో గెలుస్తుందని, ఎక్కడ చూసినా ప్రధాని మోదీ ప్రభంజనమే కనపడుతోందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తాను ఉత్తరాది రాష్ట్రాల్లోల జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని చెప్పారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా మోదీ ప్రభంజనం కనిపిస్తోందన్నారు. మోదీకి సాటిగా నిలబడగలిగే నేత వల్ల ఢిల్లీ నుంచి గల్లీస్థాయి నేతలంతా తాము కూడా ప్రదాని పదవికి రేసులో ఉన్నామని చెప్పుకునే పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. అరచేతిలో సూర్యుడి వెలుతురును అపలేరన్నారు. అనామక పార్టీలన్నీ ఏకమై కూటమిగా ఏర్పడినా మోదీ ప్రధానికావడాన్ని అడ్డుకోలేరన్నారు. మోదీ నేతృత్వంలో పటిష్టమైన భారత నిర్మాణానికి నాందిపలకాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో అపరమేధావిగా చెప్పుకునే శామ్‌పిట్రోడా చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడాలని ఆయన చెప్పారు.సిక్కులకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ కంటి తుడుపుగా ఒక ప్రకటన చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారన్నారు. నిజంగా రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే ఇంత దారుణమైన కామెంట్స్ చేసిన శామ్ పిట్రోడాను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలన్నారు. కాంగ్రెస్ నేతలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ పాకిస్తాన్‌కు వత్తాసుపలికే విధంగా ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు.