తెలంగాణ

17 నుండి పాలిసెట్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: తెలంగాణ పాలిసెట్ అడ్మిషన్ల కౌనె్సలింగ్ షెడ్యూలును మంగళవారం నాడు ఖరారు చేశారు. ఈ నెల 17వ తేదీ నుండి అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేయడం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్, హెల్ప్‌లైన్ సెంటర్ ఖరారు, సర్ట్ఫికేట్ల పరిశీలన వివరాలను రికార్డు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు మూడు రోజులు గడువిస్తారు. 19వ తేదీలోగా తమ ప్రాధాన్యతలను నమోదు చేయాలి. అలా నమోదు చేసుకున్న వారు 18వ తేదీ నుండి 21వ తేదీలవోగా సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరుకావల్సి ఉంటుంది. సర్ట్ఫికేట్ల పరిశీలన పూర్తి చేసుకున్న వారు కాలేజీలు, బ్రాంచిల ఆప్షన్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. 24వ తేదీన ఆప్షన్లు అన్నీ ఫ్రీజ్ చేసిన తర్వాత తొలి అలాట్‌మెంట్ ఈ నెల 27న జరుగుతుంది. సీట్లు పొందిన వారు 28వ తేదీ నుండి 31వ తేదీలోగా ట్యూషన్ ఫీజును చెల్లించాలి. అనంతరం వారు జూన్ 1న కాలేజీల్లో రిపోర్టు చేయాలి. అదే రోజు నుండి క్లాసులు మొదలవుతాయని సాంకేతిక విద్యాశాఖ అధికారులు తెలిపారు.