తెలంగాణ

అంబేద్కర్ విగ్రహాన్ని పునర్ ప్రతిష్ఠించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చిన చోటనే పునర్ ప్రతిష్టించాలని అఖిల పక్ష నాయకులు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి డిమాండ్ చేశారు. హైదరాబాద్ పంజాగుట్ట వద్ద అంబేద్కర్ విగ్రహం కూల్చివేతపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో అఖిల పక్ష నాయకులు మంగళవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించారు. అంబేద్కర్ విగ్రహం కూల్చివేతకు బాధ్యులైన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని వారు ప్రశ్నించారు. విగ్రహం కూల్చివేతపై ప్రభుత్వం ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. విగ్రహాన్ని కూల్చిచోటనే కాంస్య విగ్రహన్ని ప్రతిష్టించాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ నాయకుడు జి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేయడమంటే ఆయన ఆలోచనలను అవమానించడమేనని అన్నారు. అంబేద్కర్ విగ్రహం కూల్చివేత వెనుక ఉన్నది ఎవరో వారి పేర్లను బయట పెట్టాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ డిమాండ్ చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ తదితరులు ఉన్నారు.

చిత్రం... గవర్నర్ నరసింహన్‌ను కలిసిన వివిధ పార్టీల నాయకులు