తెలంగాణ

‘ఇంటర్’ న్యాయం జరిగే వరకూ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే వరకూ పోరాటం ఆగదని అఖిలపక్ష పార్టీల విద్యార్థి, యువజన సంఘాలు స్పష్టం చేశాయి. బుధవారం నాడు ముఖ్దూం భవన్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో విద్యార్థి, యువజన సంగాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతుంటే విద్యార్థుల శవాలపై కేసీఆర్ విహార యాత్ర చేస్తున్నారని విమర్శించారు. గత కొన్ని రోజులుగా ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వానికి ఎలాంటి చలనం లేకుండా నిద్రమత్తులో ఉందని అన్నారు. విద్యార్థి కుటుంబాలను ఓదార్చడానికి బదులు హేళన చేసే విధంగా మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అధికారులపైనా, మంత్రిపైనా , గ్లోబరీనా సంస్థపైనా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థి కుటుంబాలకు 50 లక్షలు చొప్పున పరిహారం, ఇంటిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు కోరారు. ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు చెప్పారు. ఈ సమావేశంలో ఎఐవైఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు వలీ ఉలా ఖాద్రీ, మారుపాక అనీల్‌కుమార్, ఎఐఎస్‌ఎఫ్ కార్యదర్శి శివరామకృష్ణ, ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు బీ వెంకట్, పీడీఎస్‌యూ అధ్యక్షుడు ఎన్ పరశురాం, ఎఐడీవైఓ నేత కే భరత్, టీఎన్‌ఎస్‌ఎఫ్ ఉపాధ్యక్షుడు పీ శరత్ చంద్ర, ఎఐపీఎస్‌యూ కార్యదర్శి కిరణ్‌కుమార్, టీఎస్‌యు అధ్యక్షుడు సందీప్ చమార్, జనసేన విద్యార్థి విభాగం నేత సంపత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు తీర్పు గుణపాఠం : చాడ వెంకటరెడ్డి
3,82,112 మంది విద్యార్థుల జవాబుపత్రాలను 27వ తేదీలోగా వెబ్‌సైట్‌లో ఉంచాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంటర్ బోర్డుకు గుణపాఠమని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయని ఆయన చెప్పారు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు 50లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇంటర్ సప్లిమెంటరీ వాయిదా వేయాలి
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేయాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుత్‌రావు కోరారు. రీ వెరిఫికేషన్ ఫలితాలను ఈ నెల 27న ప్రకటించాలని హైకోర్టు ఆదేశించిన దరిమిలా 25వ తేదీ నుండి జరగాల్సిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేయాలని ఆయన కోరారు.
17న ఉస్మానియా 80 వ స్నాతకోత్సవం
ఉస్మానియా యూనివర్శిటీ 80వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 17న నిర్వహించనున్నట్టు వీసీ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం తెలిపారు. ఐఐసీటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ చంద్రశేఖర్ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. చాన్సలర్ హోదాలో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ కూడా వస్తారని అన్నారు. జూన్ 2018కంటే ముందు యూజీ, పీజీ చేసిన వారు, 2019 జూన్ 11 లోగా పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి ఈ స్నాతకోత్సవంలో పట్టాలు అందజేస్తామని పేర్కొన్నారు.