తెలంగాణ

‘దోస్త్’ నోటిఫికేషన్ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: తెలంగాణలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో ఒకే దరఖాస్తుతో ప్రవేశాలు నిర్వహించేందుకు చేపట్టిన దోస్త్ (డైరెక్టు ఆన్‌లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదల వాయిదా పడింది. బుధవారం నాడు జరిగిన దోస్త్ కమిటీ అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల రీ వెరిఫికేషన్ ఫలితాలను ఈ నెల 27 నాటికి విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దోస్త్ నోటిఫికేషన్‌ను వాయిదా వేశారు. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బీ జనార్ధన్‌రెడ్డి అధ్యక్షత వహించిన దోస్త్ కమిటీ సమావేశానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి , ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఏ అశోక్ కుమార్, సీజీజీ డీజీ రాజేంద్ర నింమ్జే, ఇతర అధికారులు హాజరయ్యా రు. తదుపరి నోటిఫికేషన్‌ను ఈ నెల 22న జారీ చేస్తారు. 23వ తేదీ నుండి ఆన్‌లైన్ ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని దోస్త్ కన్వీనర్ ఆర్ లింబాద్రి తెలిపారు.
చిత్రం... విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న కన్వీనర్ ఫ్రొ.లింబాద్రి, కమిటీ సభ్యులు