తెలంగాణ

రాచకొండ గుట్టల్లో క్షిపణి ప్రయోగ కేంద్రం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్థాన్‌నారాయణపురం, మే 15: గత దశాబ్ద కాలంగా ఊరిస్తూ వస్తున్న క్షిపణి ప్రయోగకేంద్రం మళ్ళీ తెరపైకి వచ్చింది. గత రెండు రోజులుగా రెవెన్యూ, బీడీఎల్ అధికారులు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో రాచకొండలో పర్యటిస్తున్నారు. గతంలో గుర్తించిన హద్దులను సర్వేయర్ సహాయంతో పరిశీలిస్తున్నారు. ఆరేళ్ళ క్రితం రాజకీయ పార్టీలు, గిరిజనులు ఉద్యమించడంతో బీడీఎల్ అధికారులు తాత్కాలికంగా ప్రతిపాదనను విరమించుకున్నారు. ప్రస్తుతం దేశ రక్షణ అవసరాల రీత్యా క్షిపణులను ఎక్కువ సంఖ్యలో తయారుచేసి పరీక్షించాల్సి వస్తోంది. ప్రస్తుతం బీడీఎల్ సంస్థ తయారు చేసిన క్షిపణులను సుదూర ప్రాంతాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిషా రాష్ట్రాలకు తీసుకువెళ్ళాల్సి వస్తోంది. అధిక ఖర్చుతో పాటు, సుమారు 1000 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లి పరీక్షలు చేయడం వల్ల కొన్ని సార్లు క్షిపణులు లక్ష్యాలను ఛేదించలేకపోతున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే హైదరాబాద్‌కు అతి చేరువలో వృథాగా ఉన్న వందలాది ఎకరాల భూమి రాచకొండలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నెలలో ఒకసారి క్షిపణులను రాచకొండకు తీసుకు వచ్చి పరీక్షిస్తారు. అప్పట్లో సరళమైసమ్మ గుట్టలు, ఐదుదోనలతండా, నేల్దాంపాడు, బూర్గుచెట్టుమూల గుట్టల ప్రాంతాలను గుర్తించారు. హైదరాబాద్ కాంచన్‌బాగ్‌లోని బీడీఎల్ సంస్థలో క్షిపణులను తయారు చేస్తున్నారు. వాటిని అతి తక్కువ సమీపంలో ఉన్న రాచకొండ గుట్టల్లో పరీక్షిస్తారు. ఈ క్షిపణి పరీక్షించే సమయంలో ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు ముందుగానే సమాచారం ఇస్తారు. ప్రయోగానంతరం ప్రజలు, రైతులు, గిరిజనులు మళ్ళీ అక్కడే ఉండి ఎవరి పనులు వారే చేసుకోవచ్చన్నది ఈప్రాజెక్టు ప్రతిపాదనగా ఉన్నట్టు బీడీఎల్ అధికారులు వివరిస్తున్నారు. ఎవరికైనా నష్టం జరిగినా, కూలిపనులు చేసుకోకుండా ఇబ్బందులు వస్తే వారికి కూలీ డబ్బులతోపాటు, నష్టాలను చెల్లిస్తారు. ఈ క్షిపణి ప్రయోగ కేంద్రం వల్ల ఎవరికీ ఎటువంటి నష్టం వాటిల్లదని బీడీఎల్ అధికారులు వివరిస్తున్నారు.
చిత్రం... రాచకొండ గుట్టల్లో సర్వే మ్యాపుల ద్వారా హద్దులు పరిశీలిస్తున్న
ఆర్డీవో సూరజ్‌కుమార్, బీడీఎల్ అధికారులు