తెలంగాణ

పిడుగుపాటుకు రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగాల, మే 15: పిడుగు పడి రైతు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. లింగాల మండల పరిధిలోని అప్పాయపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో బుధవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షానికి పిడుగుపడి అదే గ్రామానికి చెందిన ఈదమయ్య (35) అనే వ్యక్తి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. ప్రతిరోజు మాదిరిగానే తన వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా చిరుజల్లులు పడుతుండటంతో వేరుశనగ పొల్లుపై కవర్లుకప్పు తుండగా అంతలోనే విపరీతమైన ఈదురుగాలులతో కూడిన వర్షానికి పెద్ద శబ్దంతో పడిన పిడుగుపాటుకు అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పిడుగుపాటుకు వేరుశనగ పొల్లుపక్కనే ఉన్న గడ్టివాము దగ్ధమైంది. మృతునికి భార్య లక్ష్మమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటనాస్థలానికి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలకోసం రూ.10వేలు అందచేశారు. ప్రభుత్వపరంగా మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మాజీ జడ్పీటీసీ మాకం తిరుపతయ్య, సర్పంచ్ నీలవేణి, టీఆర్‌ఎస్ నాయకులు కేటీ. తిరుపతయ్య, కాశీనాథం, పర్వతాలు ఉన్నారు.