తెలంగాణ

పుట్టంగండి అత్యవసర మోటార్ల ఏర్పాటుకు జలమండలి కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దఅడిశర్లపల్లి, మే 15: జంటనగరాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కృష్ణా తాగుజలాలు సరఫరా చేసే ఏఎమ్మార్పీ పుట్టంగండి అత్యవసర మోటార్ల ఏర్పాటుకు జలమండలి కసరత్తు చేస్తోంది. రూ. 2 కోట్ల అంచనాలతో గత నెల 24న టెండర్లు పిలిచినప్పటికీ అనర్హత సమస్య ఎదురవ్వడంతో మరోసారి ఈనెల 3న టెండర్‌లను పిలిచారు. మరో వారం రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పుట్టంగండి వద్ద నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లో అత్యవసర మోటార్లు బిగించి ఏఏమ్మార్పీ మోటార్లకు నీరందించేందుకు ఏర్పాట్లు చేపట్టనున్నారు. ప్రస్తుతం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 243.5 ఎఫ్‌ఆర్‌ఎల్ నీటి మట్టంతో ఉండగా, ఈ నీటితో మరో 20 రోజుల వరకు జంటనగరాలకు తాగునీరు అందించవచ్చు. జంటనగరాల తాగునీటికి నిత్యం 525 క్యూసెక్కులను పంపింగ్ చేస్తుండగా, మిషన్ భగీరథకు 40క్యూసెక్కులు పంపింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం పుట్టంగండి వద్ద రెండు ఏఎమ్మార్పీ మోటార్లు ద్వారా 900 క్యూసెక్కులను ఏకేబీఆర్‌కు తరలిస్తారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి మట్టం 511 అడుగల వద్ద నిలకడగా ఉండగా, కనీస నీటి మట్టం డెడ్ స్టోరేజీ 510 అడుగులకు ఒక అడుగు ఎక్కువుంది. ఏఎమ్మార్పీ రెండు ప్రధాన మోటార్లకు నీరందని పక్షంలో పుట్టంగండి అత్యవసర మోటార్ల ద్వారా సాగర్ నీటి మట్టం 503 అడుగుల వరకు ఒక్కో మోటార్ ద్వారా 400 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసుకుని ప్రధాన మోటార్లకు అందించే అవకాశం ఉంటుంది. వర్షాలు పడకుండా, ఎగువ నుండి కృష్ణానదికి వరదలు రానిపక్షంలో ఈ నెలాఖరులోగా పుట్టంగండి అత్యవసర మోటార్లు బిగించేందుకు హైద్రాబాద్ జలమండలి ఏర్పాట్లు చేసుకుంటుంది.