తెలంగాణ

ఏషియా యూనివర్శిటీ ప్రొఫెసర్‌గా సెంట్రల్ యూనివర్శిటీ వీసీ అప్పారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: తైవాన్‌లోని ఆసియా యూనివర్శిటీ గౌరవ ప్రొఫెసర్‌గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ పొదిలి అప్పారావు నియమితులయ్యారు. జీవశాస్త్రంలో ప్రఖ్యాత శాస్తవ్రేత్తగా పేరుగడించిన పొదిలి అప్పారావు ఆసియా యూనివర్శిటీ బయోటెక్నాలజీ విభాగంలో ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ మేరకు ఆసియా యూనివర్శిటీ అధ్యక్షుడు జెఫర్ జేపీ టిసాయి ఉత్తర్వులను అందజేశారు. కాగా ముంబైలోని రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా వాణిజ్య దూత అదె సుకేందర్ గురువారం నాడు ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ సురేష్‌కుమార్‌ను కలుసుకున్నారు. సుకేందర్ వెంట తొమ్మిది మందితో కూడిన బృందం కూడా వచ్చింది. భారత్ - ఇండోనేషియాల మధ్య క్రియాశీల సహకారం ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా సుకేందర్ చెప్పారు. ఇఫ్లూ ప్రత్యేక ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు, దౌత్యవేత్తలకు నైపుణ్య శిక్షణతో పాటు సాంస్కృతిక సంబంధాలను కూడా ప్రోత్సహించగలుగుతుందని అన్నారు. ఇండోనేషియా విద్యార్థులు అనేక మంది భారత్‌లో చదువుతున్నారని అన్నారు.