తెలంగాణ

ఆరుగురి ఉసురు తీసిన వడదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 16: తెలంగాణలో వడదెబ్బకు వివిధ జిల్లాల్లో ఆరుగురు మృతి చెందారు. వృద్ధులు,దినసరి కూలీలే కాదు, ఒక విద్యార్థిని సైతం ఈ వడదెబ్బకు కన్నుమూసింది. సూర్యాపేట జిల్లా కోదాడలోని సాయికృష్ణ థియేటర్ వెనుక బజారులో దినసరి కూలీగా జీవనం సాగిస్తున్న వడ్డాణపు కోటయ్య (65) వడదెబ్బకుగురై మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. దహన సంస్కారాలకు కూడా డబ్బులులేకపోవడంతో దాతలు ముందుకు వచ్చి 11వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం లక్కారం పంచాయతీ పరిధిలోని వేణునగర్‌కు చెందిన కుర్సింగ కౌసల్య బాయి (62) వడ దెబ్బకు గురై బుధవారం మృతి చెందింది. ఆమె కుమారుడు భూమన్న తెలిపిన వివరాల ప్రకారం వడదెబ్బతో అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ధర్మారావుపేట గ్రామానికి చెందిన కొల్లూరి బుచ్చమ్మ (55) అనే ఉపాధి హామీ కూలీ వడదెబ్బ సోకి బుధవారం మృతిచెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
బుచ్చమ్మ సోమవారం ఉపాధి హామీ పనికి వెళ్లింది. పని నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో మేదరిపేటలోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. మంగళవారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించేలోపే బుచ్చమ్మ మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన పిల్లి ఎల్లయ్య (65) అనే వ్యక్తి వడదెబ్బ తగిలి గురువారం మృతి చెందాడు.
గత రెండు రోజులుగా ఎండ తీవ్రంగా ఉండడంతో అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రానికి చెందిన కెవి జనార్ధన్‌గౌడ్(56) అనే గీత కార్మికుడు వడదెబ్బతో గురువారం ఉదయం మృతి చెందాడు. పట్టణంలో నివాసం ఉంటున్న జనార్ధన్‌గౌడ్ బుధవారం వడదెబ్బ తగిలి రాత్రి అస్వస్థతకు గురి కావడంతో ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిర్మల్ జిల్లా ముధోల్‌లోని ముక్తాదేవి నగర్‌కు చెందిన నందిని(12) అనే విద్యార్థిని వడదెబ్బతో గురువారం మృతిచెందింది. కొన్ని రోజుల క్రితం తన అమ్మమ్మ ఊరైన కుభీర్ మండలంలోని పార్డి(బి) గ్రామానికి శుభకార్యానికి వెళ్లింది. అక్కడ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్సను అందించారు.
అనంతరం భైంసా, నిర్మల్ ఆసుపత్రుల్లో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో వైద్యుల సలహామేరకు హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిలోఫర్ ఆసుపత్రిలో మృతి చెందినట్లు కుటుంబీకులు పేర్కొన్నారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో నందిని 7వ తరగతి పూర్తి చేసుకుంది.