తెలంగాణ

బాబు, కేసీఆర్ నాటకాలను జనం నమ్మరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో అధికారంలో వచ్చేందుకు చేస్తున్న ప్రచార నాటకాలను ప్రజలు నమ్మరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ అన్నారు. గురువారం ఇక్కడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతల కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ తెలంగాణలో ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధిస్తుందని చెప్పారు. బీజేపీకి సొంతంగా 300 సీట్లు వస్తాయన్నారు. తెలంగాణలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని ఆయన న్నారు. రాష్ట్రంలో బీజేపీకి సీట్లు, ఓట్లు పెరుగుతాయని ఆయన అన్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు వచ్చాయన్నారు. రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్‌కు ధీటుగా పనిచేయాలని ఆయన చెప్పరు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ భారత రాష్టప్రతి, హోంశాఖ మంత్రిని కలవనున్నట్లు ఆయన చెప్పారు. బెంగాల్‌లో జరుగుతున్న పరిణామాలపై విశే్లషించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను గూండా అని టీఎంసీ అధినేత, సీఎం మమతా బెనర్జీ పేర్కొనడం విచారకరమన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తామన్నారు. అంబర్‌పేటలో ఫ్లైవోవర్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రంలో హంగ్ వచ్చే ప్రసక్తిలేదని ఆయన చెప్పారు. ఓటమి భయంతోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్‌తో నీతి బాహ్యమైన పొత్తుకు సిద్ధపడ్డారని ఆయన ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధన రాజకీయాలపై చర్యలు తీసుకోవాలి
జడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి కోరారు. ఎన్నికల్లో క్యాంపులు, డబ్బు రాజకీయాలను అరికట్టాలని కోరారు. దీని నిమిత్తం తక్షణమే ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో అవినీతి అక్రమాలు, అధికారం, ధనం కండబలాల ప్రభావం పడకుండా ఎన్నికలు నిర్వహించే సువర్ణ అవకాశాన్ని ఎన్నికల సంఘం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం జిల్లా, మండల, పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నికల నిర్వహణకు మూడు రోజుల గడువుతో నోటిఫికేషన్ ఇవ్వవచ్చు అన్నారు. ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసిన పక్షంలో ఎన్నికల్లో ఎలాంటి బేరసారాలు, ప్రలోభాలు, ఒత్తిడులకు అవకాశం ఉండదన్నారు. ధన ప్రభావం కూడా పూర్తిగా తగ్గిపోతుందన్నారు. జూలై 5వ తేదీ తర్వాత చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికలు ఉంటాయని వార్తలు రావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రస్తుత పాలకవర్గాలకు మరో నెల రోజుల గడువు ఉన్నప్పటికీ ఈ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఆటంకం ఉండదన్నారు. ఎన్నికల సంఘం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం కల్పించాలన్నారు.
హంగ్ రాదు, బీజేపీకే మెజారిటీ: దత్తాత్రేయ
కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని, చక్రం తిప్పాలన్న కేసీఆర్, చంద్రబాబు కలలు భగ్నమవుతాయని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు 23వ తేదీన యూపీఏ పక్షాల మీటింగ్ పెట్టాలన్న సోనియాగాంధీ తాపత్రయపడుతున్నారని, కాని ప్రజలు మాత్రం బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇవ్వనున్నారన్నారు. కలగూరగంప పార్టీల కలయిక వల్ల దేశం అస్థిర రాజకీయాలు రాజ్యమేలుతాయన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా పరిమితమైన పాత్ర అని, తన సొంత అస్తిత్వం కోసం పాకులాడుతున్నారన్నారు. ఫలితాలు రాకముందే విపక్షపార్టీలు అధికారం కోసం నానా తంటాలు పడుతున్నాయన్నారు. కేంద్రంలో హంగ్ వస్తుందన్న విపక్ష నేతల కలలు కంటున్నారన్నారు. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌కు ఆదిలోనే చుక్కెదురైందన్నారు. కాంగ్రెస్ పార్టీకి 80 నుంచి 100 లోపు సీట్లు వస్తే గొప్ప అని ఆయన అన్నారు. పశ్చిమబెంగాల్‌లో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.