తెలంగాణ

శ్రీనివాస్‌రెడ్డిని ఎన్‌కౌంటర్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మలరామారం, మే 17: నరహంతకుడు శ్రీనివాస్‌రెడ్డి దారుణ హత్య కేసుల బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, హాజీపూర్ గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నందున శ్రీనివాస్‌రెడ్డిని ఎన్‌కౌంటర్ చేయాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీహెచ్. హన్మంత్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తూ శ్రావణి, మనీష, కల్పన కుటుంబ సభ్యులు, హాజీపూర్ గ్రామస్తులు బొమ్మలరామారం మండల కేంద్రంలో చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష శుక్రవారం నాటికి రెండవ రోజుకు చేరింది. దీక్షాశిబిరాన్ని వీహెచ్ సందర్శించి తన సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్‌రెడ్డిచేతిలో హతమైన శ్రావణి, మనీషా, కల్పన కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే పరామర్శించి వారికి అండగా నిలబడకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని, రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నా కేసీఆర్ పట్టించుకోకుండా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపేరుతో ఇతరరాష్టాలలో తిరుగుతూ తెలంగాణ రాష్ట్రాన్ని గాలికొదిలేశారని హన్మంతరావు విమర్శించారు. ఎన్నికల కోడ్‌పేరుతోబాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా ఫాస్ట్‌ట్రాక్‌కోర్టు ఏర్పాటుచేసి శ్రీనివాస్‌రెడ్డిని విచారించేందుకు చర్యలు చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేంద్రంలో పదవులకోసం పాకులాడడంమాని హాజీపూర్ బాధితులను ఆదుకునేందుకు శ్రద్ధచూపాలని, అదేవిధంగా శ్రీనివాస్‌రెడ్డినేరాలపై విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్‌కోర్టు ఏర్పాటు చేసేందుకు చర్యలుచేపట్టాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

చిత్రం...దీక్షా శిబిరాన్ని సందర్శించి విలేఖరులతో మాట్లాడుతున్న హన్మంతరావు