తెలంగాణ

నిర్వాసితులను దగా చేస్తున్న కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 17: సాగునీటి ప్రాజెక్టుల భూ నిర్వాసితులను ముఖ్యమంత్రి కేసీఆర్ దగా చేస్తున్నారని వారికి రావాల్సిన పరిహారం ఇవ్వడంలో జాప్యం చేయడం ఏమిటని సీఎల్పీ నేత మల్లుభట్టివిక్రమార్క ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో భాగంగా రెండురోజుల పాటు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన శుక్రవారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూనిర్వాసితులతో కూడా భేటీ అయ్యారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నాగర్‌కర్నూల్ జిల్లా వట్టెం రిజర్వాయర్ పరిధిలోని కారుకొండతాండ, అనిఖానిపల్లితండా భూనిర్వాసితులు గత వారం రోజులుగా మల్లన్నసాగర్ తరహాలో తమకు పరిహారం చెల్లించాలంటూ నిరాహర దీక్షలకు దిగారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని మల్లుభట్టివిక్రమార్క, మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లురవి సందర్శించి నిర్వాసితులకు మద్దతు పలికారు. దీక్షా శిబిరంలో మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ తెలంగాణలో ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ ఒకే తరహాలో పరిహారం ఇవ్వాలని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ భూనిర్వాసితులపై కూడా వివక్షత చూపుతున్నారని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టు భూనిర్వాసితులు మల్లన్నసాగర్ తరహాలో పరిహారం ఇవ్వాలని చేస్తున్న డిమాండ్‌లో తప్పెమీ లేదన్నారు. తరతరాలుగా భూమిని నమ్ముకుని బతుకుతున్న రైతులకు ఎంత ఇచ్చినా తక్కువేనని ప్రాజెక్టుల నిర్మాణం కోసం రైతులు భూమిని ఇవ్వడం అంటే త్యాగం చేసినట్టేనని అలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రాజెక్టులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని చెప్పడం ముమ్మాటికీ తప్పేనని ప్రతిపక్షాలు ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మించాలని డిమాండ్ చేస్తూనే భూనిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని కోరడం ప్రాజెక్టులను అడ్డుకోవడం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి రూపకల్పన చేసింది, కొన్ని సాగునీటి ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్ పార్టీయేనని ఈ విషయాన్ని కేసీఆర్ మరచిపోవద్దని హితవు పలికారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ మూడేళ్లలో రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులతో పాటు నూతనంగా నిర్మించతలపెట్టిన వాటన్నింటినీ పూర్తిచేస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభివృద్ధిపై దృష్టి లేదని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకుని టీఆర్‌ఎస్‌లో కలుపుకోవడంపైనే ఆయన శ్రద్ధంతా అని ఎద్దేవా చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం భూనిర్వాసితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు.

చిత్రం...పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని వట్టెం రిజర్వాయర్ నిర్వాసితుల
దీక్షా శిబిరంలో ప్రసంగిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క