తెలంగాణ

జూరాల నీటి విడుదలతో తీరనున్న తాగునీటి ఎద్దడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూర్, మే 17: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు వరప్రదాయనిగా ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుండి తాగునీటి నిమిత్తం శుక్రవారం జూరాల అధికారులు నీటిని విడుదల చేయడంతో ఉమ్మడి జిల్లాకు తాగునీటి ఇబ్బందులు తీరనున్నాయి. గడిచిన నెలరోజులుగా జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా పడిపోవడంతో వనపర్తి, నాగర్‌కర్నూల్, షాద్‌నగర్, అచ్చంపేట, మహబూబ్‌నగర్ తదితర పట్టణాలకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. పూర్తిగా నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి పడిపోవడంతో తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రికి అల్మట్టి ప్రాజెక్టు నుంచి తాగునీటి నిమిత్తం నీటిని విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో గత వారం అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుండి 2.50 టీఎంసీల నీటి విడుదలకు చర్యలు చేపట్టడంతో గత బుధవారం రాత్రి వరకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు నీరు చేరుకుంది. గురువారం నాటికి 1.86 టీఎంసీల సామర్థ్యం నుండి 2.50 టీఎంసీల సామార్థ్యానికి నీరు పెరగడంతో శుక్రవారం ఉదయం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుండి తాగునీటి అవసరాల నిమిత్తం ప్రధాన ఎడమ కాల్వ ద్వారా రామన్‌పాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు పీజేపీ ఈఈ శ్రీ్ధర్ నీటిని విడుదల చేశారు. ప్రధాన ఎడమ కాల్వ ద్వారా రామన్‌పాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు ప్రతిరోజు 400 క్యూసెక్యుల చొప్పున తాగునీటి నిమిత్తం విడుదల చేసిన పక్షంలో ప్రస్తుత వేసవి కాలానికి సంబంధించి తాగునీటి సమస్య నుండి గట్టెక్కవచ్చని జూరాల ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి నీటి విడుదలకు అంగీకరించడంతో తాగునీటి ఇబ్బందులు తీరుతాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చిత్రం... జూరాల ప్రాజెక్టు నుంచి ప్రధాన ఎడమ కాల్వ రామన్‌పాడు ప్రాజెక్టుకు చేరుతున్న నీరు