తెలంగాణ

మిషన్ భగీరథతో 24 వేల గ్రామాలకు నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: రాష్ట్రంలో అన్ని ఇళ్లకు తాగునీటిని అందించడమే మిషన్ భగరీథ లక్ష్యమని, సమాన స్థాయిలో నీటిని సరఫరా చేయడాన్ని కేంద్ర తాగునీటి సరఫరా విభాగం డిప్యూటీ సలహాదారు రాజశేఖర్ ప్రశంసించారు. రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాలు, తాగునీటి సరఫరా అవుతున్న ఆవాసాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన ఇక్కడ మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ గతంలో కొన్ని రాష్ట్రాలు తాగునీటి పథకాలను ప్రారంభించినా, కేవలం కొన్ని గ్రామాలకే పరిమితమయ్యాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ కింద 24 వేల గ్రామాలకు నీళ్లు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. భగీరథ కింద నిర్మించిన నీటి శుద్ధి కేంద్రాలు బాగా పని చేస్తున్నాయన్నారు. ఇవే ప్రమాణాలను పాటించాలని ఆయన సూచించారు. నీటి శుద్ధి కేంద్రాల్లో రీ స్లైక్లింగ్ విధానంతో వృథా అయిన నీటిని తిరిగి శుద్ధి చేయడం బాగుందన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్ విజయ్‌పాలౌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.