తెలంగాణ

నేడు రామగుండంకు సీఎం రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, మే 17: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం రామగుండం ఎన్టీపీసీకి రానున్నారు. 85వేల కోట్లతో కోటి ఎకరాల తెలంగాణ సాగుభూములకు నీరందించేందుకు నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల పరిశీలన... తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం ఎన్టీపీసీలో వేల కోట్ల రూపాయల వ్యయంతో ఎన్టీపీసీలో నిర్మాణమవుతున్న తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను సందర్శించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడకు వస్తున్నారు. శుక్రవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక భద్రతా సిబ్బంది బలగాలు ఎన్టీపీసీలోని హెలిప్యాడ్‌ను పరిశీలించారు. ఇప్పటికే టౌన్‌షిప్‌తోపాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలన్నింటినీ పోలీసు భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకుంది. ముఖ్యమంత్రి ఎన్టీపీసీలో బస చేయనున్న నేపథ్యంలో పోలీసు భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. శనివారం మధ్యాహ్నం వేళ హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ థర్మల్ ప్రాజెక్ట్‌ను సందర్శిస్తారు. అనంతరం ఎన్టీపీసీ ఇడిసి బిల్డింగ్‌లో ఎన్టీపీసీ, తెలంగాణ జెన్‌కో ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం ప్రత్యేకంగా నిర్మాణమవుతున్న తెలంగాణ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యవహారాలను చర్చించడంతో పాటు జెన్‌కో విద్యుత్ కర్మాగారాల ఉత్పత్తి వివరాలను కూడా కేసీఆర్ సేకరించనున్నారు. అక్కడ గంటల పాటు తెలంగాణ థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన పూర్వపరాల సమీక్ష అనంతరం ఎన్టీపీసీలోనే ముఖ్యమంత్రి బస చేస్తారు. తిరిగి 19వ తేదీ ఆదివారం భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రిలింగేశ్వర స్వామి ఆలయాన్ని చేరుకుంటారు. అక్కడ ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించిన పిదప తెలంగాణ రాష్ట్రంలోని కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు వేల కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను స్వయంగా పర్యవేక్షిస్తారు. కనె్నపల్లి, మేడిగడ్డ పంప్‌హౌస్, బ్యారేజీ నిర్మాణం పనులను పరిశీలించి ఇటీవల ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చినప్పుడు జరిగిన పనులు... ఇటీవల జరిగిన పనుల పురోగతిని తెలుసుకోనున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అనుబంధంగా నిర్మాణం జరిగిన కనె్న పంప్‌హౌస్ పనులు పూర్తి దశకు చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ వెటరన్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన వివరాలపై జిల్లా యంత్రాంగం అధికారికంగా షెడ్యూల్ విడుదల చేయలేదు.