తెలంగాణ

బాండ్ల అమ్మకాలతో రుణాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: తెలంగాణ ప్రభుత్వం నిధులు సమకూర్చుకోడానికి బాండ్ల అమ్మకాల ద్వారా రుణాలు పొందాలన్న యోచన దివాళాకోరుతనమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ధనిక రాష్ట్రం అంటూ చెబుతున్న తెలంగాణకు అప్పులు తీసుకువస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పులు తీసుకువస్తున్నారంటే రాష్ట్ర ప్రజలపై భారం మోపడానికేనని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని ఆయన గుర్తుచేశారు. సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయడానికి రుణాలు తెస్తామని చెప్పడం చూస్తే వాస్తవాలను దాస్తున్నారని ఆయన నిలదీశారు. బడ్జెట్‌కు సంబంధం లేకుండా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేయడం సిగ్గు చేటన్నారు. రైతుబంధు పథకం అమలు చేయడానికే రెండువేల కోట్లు తీసుకురావడానికి బాండ్లు అమ్మకాల ద్వారా సేకరించాలని సీఎం యోచించడం దురదృష్టకరమన్నారు. ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సిన బాధ్యతను గుర్తించి ఏ ప్రాజెక్టుకు ఎన్నివేల కోట్లు వెచ్చించారో చెప్పాలన్నారు. తెచ్చిన అప్పులు ఎక్కడ ఖర్చు చేశారో వివరాలను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పర్థితిపై శే్వత పత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ డిమాండ్ చేశారు.