తెలంగాణ

దేశానికి రోల్ మోడల్ తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట: రైతుల కళ్లలో సంతోషాన్ని చూసే... ప్రజలు చిరునవ్వులతో బతికే రోజులు తెలంగాణలో రానున్నాయని.. ఆ దిశగా కేసీఆర్ పాలన సాగుతోందని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐల ఆధ్వర్యంలో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ట్యాంపా సిటీలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అమెరికాలో మీరిచ్చే ఆతిథ్యం.. ఆత్మీయతను చూస్తే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో ఉన్నట్టు అన్పిస్తోందని..చాలా సంతోషంగా ఉందని అన్నారు. 2010 తెలంగాణ ఉద్యమ సమయంలో అమెరికాకు వచ్చిన సమయంలో 10 రోజుల్లో 14 రాష్ట్రాల్లో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో పాలుపంచుకున్నట్టు తెలిపారు. ఇప్పుడు 2019 ట్యాంపాలో మాత్రమే అందరినీ కలిసినట్టు పేర్కొన్నారు. రైతు కష్టాలు, వారు పడిన ఇబ్బందులపై ఇక్కడి పిల్లలు చేసిన డాక్యుమెంటరీ చూస్తే 2010 లోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అనుకున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రం వచ్చిందని, అదే విధంగా వచ్చే రెండేళ్లలో రైతుల పడే కష్టాలు పోయి రైతుల కళ్లలో సంతోషాన్ని కచ్చితంగా చూస్తామన్నారు. ఒకప్పుడు భారతదేశంలో అభివృద్ధి అంటే బెంగాల్ అని, దేశానికి మోడల్ కేరళ రాష్ట్రం అనుకునేవారన్నారు. కాని ఇప్పుడు తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అని.. దేశ నలుమూలల్లో వినిపిస్తుందన్నారు. 24 గంటల పాటు విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతులకు మిషన్‌కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాల మాగాణిగా చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఎరువులు, విత్తనాల పంపిణీ, మార్కెటింగ్ వ్యవస్థ, మోటార్, స్టార్టర్ లేని వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తూ రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు. వారి జీవితాల్లో భరోసా కల్పించింది టీఆర్‌ఎస్ సర్కారే అన్నారు.
సీఎం కేసీఆర్ నిర్ణయాలతోనే తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని హరీష్‌రావు చెప్పారు. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యల్లో మహారాష్టల్రోని విదర్భ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉండేవన్నారు. అలాంటి స్థాయి నుండి రైతుల ఆత్మహత్యల లేని తెలంగాణగా రూపుదిద్దుకుంటుందన్నారు. మొక్క పెరిగి ఫలాన్ని ఇవ్వటానికి కొంత సమయం పడుతుందని, అదే విధంగా ఒకటి.. ఒకటిగా చేసుకుంటూ ఆకుపచ్చ, చిరునవ్వుల తెలంగాణ దిశగా సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఒక వ్యవసాయ రంగం మాత్రమే కాదని, విద్య, వైద్యం విద్యుత్ ఇలా అన్ని రంగాల్లో ప్రగతి సాధించే దిశగా సర్కార్ ముందుకు పోతుందన్నారు. నాటి తెలంగాణ ఉద్యమంలో..నేటి అభివృద్ధిలో ఎన్‌ఆర్‌ఐ పాత్ర ఏంతో కీలకంగా ఉందన్నారు. కేసీఆర్ సర్కార్‌కు, టీఆర్‌ఎస్ పార్టీకి మేలు చేయటంలో మీ సహకారం మరువలేనిదన్నారు. మీ పట్టుదల, సమయపాలన చాల నచ్చిందని అభిప్రాయం పడ్డారు. రాబోయే రోజుల్లో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి జరిగి దేశానికి గొప్ప రోల్ మోడల్‌గా నిల్వ ఉందని పేర్కొన్నారు.
వృత్తిగా వ్యవసాయం
అమెరిగా వెళ్లి ఇంజనీర్, డాక్టర్ ఉద్యోగాలు చేసే రోజులు చూసామని, అదే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, డాక్టర్లు కూడా వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్నారని హరీష్‌రావు పేర్కొన్నారు. ఒకప్పుడు రైతు అంటే చిన్న చూపు ఉండేదని, కాని నేడు రైతు అంటే గౌరవం అన్నారు. ఇప్పుడు ఐటీని ఫ్రొఫెషనల్‌గా ఎంచుకున్న వారు సైతం వ్యవసాయాన్ని ప్రొఫెషన్‌గా చేసుకునే రోజులు వచ్చే నాలుగు ఏళ్లలో రాబోతున్నాయన్నారు. మీరు ఉద్యోగ రీత్యా..ఉన్నత చదువుల కోసం ప్రాంతాలు మారినా మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని మరువలేదని ఎన్‌ఆర్‌ఐలను ఉద్దేశించి అన్నారు. అమెరికాలో ఉన్న మన అలవాట్లను మరిచిపోలేదని, మీ పిల్లలకు సైతం మన సంస్కృతి, సంప్రదాయాన్ని నేర్పించటం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. ట్యాంపా సిటీలో మూడుగంటల పాటు జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న హరీష్‌రావు తొలి నిమిషం నుండి సమావేశం జరిగిన చివరి నిమిషం వరకు అందరినీ ఆప్యాయంగా, చిరునవ్వుతో పలకరించారు. హరీష్‌రావుకు తెలంగాణ సంప్రదాయం ప్రకారం మహిళలు బొట్టుపెట్టి, మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్‌రావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ అమెరికా విభాగం కన్వీనర్లు పూర్ణబైరిచందు, తాళ్ల శ్రీనివాస్, వెంగళ్ జలగం, కార్యదర్శులు నరసింహా, నాగుల వంచ, అరవింద్, తక్కళ్ల పల్లి టోని, రిషికేశ్, ధర్మారెడ్డి, కాచం జానేశ్వర్, మోహిత్, ప్లోరిడా తెలంగాణ సంఘం అధ్యక్షుడు నరేందర్ కొమ్మ, కార్యదర్శి వెంకట్ కంచర్ల, శ్రీకాంత్ జలగం, నాట్స్ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, మధవి శేఖర్, వెంకట్‌రావు తదితరులు పాల్గొన్నారు.