తెలంగాణ

లాసెట్‌కు 13141 మంది హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: తెలంగాణలోని న్యాయ విద్యా కళాశాలల్లో యూజీ, ఇంటిగ్రేటెడ్, పీజీ కోర్సులకు సోమవారం నాడు నిర్వహించిన ప్రవేశపరీక్షకు 19188 మంది హాజరయ్యారని కన్వీనర్ ప్రొఫెసర్ జీ బీ రెడ్డి పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లాసెట్ తీరును వీసీ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం పలు కేంద్రాలను సందర్శించి పర్యవేక్షించారు. పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. లాసెట్‌కు 17473 మంది దరఖాస్తు చేయగా, వారిలో 13141 మంది, లాసెట్ ఐదేళ్ల కోర్సునకు 5167 మంది దరఖాస్తు చేయగా వారిలో 4179 మంది, పీజీ లాసెట్‌కు 2280 మంది దరఖాస్తు చేయగా వారిలో 1868 మంది పరీక్ష రాశారు. మొత్తం 24,920 మంది అభ్యర్ధులకు గానూ 19188 మంది పరీక్ష రాశారని, అన్ని కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్ష ముగిసిందని కన్వీనర్ చెప్పారు. తెలంగాణలో 72 కేంద్రాల్లో, ఆంధ్రాలో నాలుగు కేంద్రాల్లో నిర్వహించారు. 2019-20 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో మూడేళ్ల డిగ్రీ కోర్సులో 2940 మంది, ఐదేళ్ల యూజీ కోర్సులో 1028, ఎల్‌ఎల్‌ఎంలో 553 సీట్లు ఉన్నాయని అన్ని కోర్సులూ కలిపి 4521 సీట్లు ఉన్నాయని ఆయన వివరించారు.
పీజీ సెట్ తేదీలు మార్చాలి
రాష్ట్రంలో వివిధ వర్శిటీల పరిధిలో డిగ్రీ విద్యార్థులకు మే 17 నుండి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయని, అదే సమయంలో వివిధ వర్శిటీల పీజీ ప్రవేశపరీక్షల తేదీలను కూడా ఖరారు చేశారని, ఏక కాలంలో రెండింటినీ ఎలా రాస్తారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎల్ మూర్తి, కార్యదర్శి కోట రమేష్‌లు ప్రశ్నించారు. దీనివల్ల పీజీ ఎంట్రన్స్ రాయాలనుకునే విద్యార్థులు ఆ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అందువల్ల పీజీ సెట్ పరీక్షలను మార్చాలని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ కోరింది. మే 30న ఒయు పరిధిలో డిగ్రీ ఎకనామిక్స్ పరీక్ష ఉందని, అదే రోజు సెంట్రల్ యూనివర్శిటీలో పీజీ ఎంట్రన్స్ ఎకనామిక్స్ పరీక్ష ఉందని, మరొకటి జూన్ 14న ఇతర వర్శిటీల పీజీ ఎంట్రన్స్ కోసం తేదీలను ఖారారు చేశారని వారు చెప్పారు.