తెలంగాణ

గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లకు మెరిట్ లిస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో ఐదో తరగతి అడ్మిషన్ల మెరిట్ జాబితాను ఖరారు చేశారు. మొత్తం 47,740 మందిని ఎంపిక చేసినట్టు సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు.ప్రవేశపరీక్షకు 1,46,411 మంది దరఖాస్తు చేశారని, అందులో 1,35,608 మంది పరీక్షకు హాజరయ్యారని, వారిలో 21,370 మంది అబ్బాయిలను, 26,370 మంది అమ్మాయిలను ఎంపిక చేశామని అన్నారు. తెలంగాణ సోషల్ వేల్ఫేర్ పరిధిలోని 141 బాలికల, 91 బాలుర హాస్టళ్లలో 11,280 మంది అమ్మాయిలను, 7280 మంది అబ్బాయిలను ఎంపిక చేశామని అన్నారు. ఇక గిరిజన సంక్షేమ గురుకులాల్లో 3370 మంది అమ్మాయిలు, 2530 మంది అబ్బాయిలు, బీసీ గురుకులాల్లో 10120 మంది అమ్మాయిలు, 10360 మంది అబ్బాయిలను, రెసిడెన్షియల్ పాఠశాలల ఆధీనంలోని గురుకులాల్లో 1600 మంది అమ్మాయిలను, 1200 మంది అబ్బాయిలను ఎంపిక చేశామని చెప్పారు. మొత్తం మీద చూసుకుంటే అమ్మాయిలకు 338 గురుకులాలు, అబ్బాయిలకు 275 గురుకులాలు ఉన్నాయని, వాటిలో 263780 మంది అమ్మాయిలను, 21370 మంది అబ్బాయిలకు ఐదోతరగతిలో సీట్లు కేటాయించడం జరిగిందని చెప్పారు.