తెలంగాణ

ప్లాస్టిక్ రంగంలో అవకాశాల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకూ అనునిత్యం ప్రతి విషయంలోనూ ప్లాస్టిక్స్ వాడకం సహజమైందని, అదే రంగంలో ఉపాధి అవకాశాలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయని, రోజురోజుకూ ప్లాస్టిక్ రంగంలో నిర్వహిస్తున్న వివిధ కోర్సులకు గిరాకీ పెరుగుతోందని సీఐపీఈటీ డైరెక్టర్ ఏవీఆర్ కృష్ణ తెలిపారు. సమాచార శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ టీవీకేరెడ్డితో కలిసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్లాస్టిక్ రంగంలో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. ప్లాస్టిక్ వాడకం గురించి ప్రజల్లో , సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ప్లాస్టిక్‌ని సరైన విధంగా వాడేలా ప్రజల్లో తమ సంస్థ ద్వారా అవగాహన పెంచుతున్నామని అన్నారు. సెంటర్ ఫర్ స్కిల్లింగ్ అండ్ టెక్నికల్ సపోర్టు సంస్థ రసాయనాలు , ఎరువుల మంత్రిత్వశాఖ ఆధీనంలో పనిచేస్తోందని అన్నారు. దీనిని 1987లోనే హైదరాబాద్‌లో స్థాపించారని, ఈ ప్రాంతంలోని ప్లాస్టిక్స్ , సంబంధిత పరిశ్రమలకు శిక్షణను సాంకేతిక సేవలను ఈ సంస్థ అందిస్తోందని చెప్పారు. వినియోగదారుల సంస్థల అవసరాలను నెరవేర్చడంలో కోసం అత్యాధునికమైన డిజైన్, సీఎడీ, సీఎఎం, సీఎఇ, టూలింగ్, ప్లాస్టిక్స్, ప్రాసెసింగ్, టెస్టింగ్ డిపార్టుమెంట్‌లకు సంబంధిత సదుపాయాలను ఈ కేంద్రంలో సమకూర్చారని అన్నారు. చర్లపల్లిలోని ఐటీఏలో ఉన్న ఈ సంస్థ కేంపస్‌లో పూర్తిస్థాయి సౌకర్యాలతో పాటు బాలబాలికలకు వసతిగృహాలు కూడా ఉన్నాయని అన్నారు. సీఐపీఈటీ దేశంలోని ఒక ప్రతిష్టాత్మక సంస్థ మాత్రమే గాక, పాలిమర్స్ సైన్స్, ఇంకా టెక్నాలజీ వంటి ప్రత్యేక రంగాల్లో పరిశోధన , అభివృద్ధిలకు గానూ ప్రపంచశ్రేణి సంస్థగా కూడా పేరుతెచ్చుకుందని వారు చెప్పారు. ఒకటిన్నర సంవత్సరాలు వ్యవధి ఉన్న పోస్టు గ్రాడ్యూయేట్ డిప్లోమో ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ కోర్సును, ఒకటిన్నర సంవత్సరాల వ్యవధి ఉండే పోస్టు డిప్లొమో ఇన్ ప్లాస్టిక్స్ వౌల్డు డిజైన్ , మూడేళ్ల డిప్లొమో ఇన్ ప్లాస్టిక్ వౌల్డ్, మూడేళ్ల డిప్లొమో ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నామని, దరఖాస్తులను జూన్ 30 వరకూ సమర్పించవచ్చని చెప్పారు. సీఐపీఈటీజేఈఈ జూలై 7వ తేదీన నిర్వహిస్తామని చెప్పారు. ఆన్‌లైన్ అడ్మిషన్లకు ఇఎడ్మిషన్ డాట్ సీఐపీఈటీ డాట్ జీవోవీ డాట్ ఇన్ అనే వెబ్‌పోర్టల్‌ను సందర్శించాలని వారు చెప్పారు.