తెలంగాణ

27న పాలిసెట్ సీట్ల ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లను 27న ఖరారు చేస్తామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. 21వ తేదీ సాయంత్రం వరకూ 30,578 మంది తమ సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరయ్యారని ఆయన చెప్పారు. ఇంత వరకూ 15717 మంది తమ ఆప్షన్లను నమోదుచేశారని, ఆప్షన్ల నమోదుకు ఈ నెల 24 వరకూ గడువు ఉందని చెప్పారు. 20వ తేదీ వరకూ సర్ట్ఫికేట్ల పరిశీలనకు 21,503 మంది హాజరయ్యారు. ప్రాసెసింగ్ ఫీజును 32,028 మంది చెల్లించారు. 32,011 మంది తమ స్లాట్‌లను నమోదు చేసుకున్నారు.
జూలై 8 నుండి సీపీజెట్
జూలై 8 నుండి సీపీజెట్ నిర్వహిస్తామని కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ కిషన్ తెలిపారు. జూలై మొదటి వారంతో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు ముగుస్తాయని, కనుక జూలై 8 నుండి సీపీజెట్ నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. సీపీజెట్ జూలై 22 వరకూ జరుగుతాయని, ఇందుకు సంబంధించిన సబ్జెక్టుల వారీ జూన్ మొదటి వారంలో షెడ్యూలు జారీ చేస్తామని ఆయన చెప్పారు.
ఫీజుల దోపిడీ అరికట్టండి: ఏబీవీపీ
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నేతలు మంగళవారం నాడు పాఠశాల విద్య కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. విద్యా హక్కు చట్టం అమలుచేయాలని, ఫీజులను నియంత్రించాలని వారు కోరారు. ఈ సందర్భంగా విద్యార్ధి నేతలు హరి, ప్రవీణ్‌రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు అధికంగా ఉన్నాయని, విద్యను వ్యాపారంగా మారుస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని విమర్శించారు. స్పెషలైజేషన్ పేరుతో లక్షలాది రూపాయిలను అధికంగా వసూలుచేస్తున్నాయని , ఏ ఒక్క ప్రైవేటు పాఠశాల కనీస నిబంధనలు పాటించడం లేదని వారు ఆరోపించారు.