తెలంగాణ

హైదరాబాద్ ట్రిపుల్‌ఐటీలో బ్లాక్‌చైన్ కోర్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ , టాలెంట్ స్ప్రింట్‌లు సంయుక్తంగా ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్- మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీస్‌ను ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌సైట్‌లోనూ ప్రారంభించాయి. దీనికి మంచి ఆదరణ రావడంతో మరిన్ని ప్రదేశాల్లో దీనిని ప్రారంభించనున్నట్టు టాలెంట్ స్ప్రింట్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ శంతన్ పాల్ చెప్పారుస. ఈ ప్రోగ్రాంలను హైదరాబాద్, బెంగలూరుల్లో 2018లో ప్రారంభించామని, లోతైన సాంకేతిక ప్రోగ్రామ్‌లను సమగ్రపరచడం ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామని అన్నారు. థియిరీని ప్రాక్టికల్‌తో, విద్యా సమగ్రతను పరిశ్రమ అనుభవంతో , ఆన్‌సైట్‌ను ఆన్‌లైన్‌తో మేళవించామని అన్నారు. ఆల్ ఇండియా ప్రోగ్రాంను హైబ్రిడ్ ఫార్మెట్‌లో 18 వారాల్లో అందిస్తున్నామని, హైదరాబాద్‌లో మూడు రోజులు చొప్పున మూడు క్యాంపస్ సందర్శనలు ఉంటాయని, ఇతర వరాల్లో ఐదు ఇంటరాక్టివ్ ఆన్‌లైన్ తరగతులు ఉంటాయని చెప్పారు. ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్ డాక్టర్ పీజే నారాయణ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలను వ్యాప్తి చేయడం ద్వారా తమ సంస్థకూ, పరిశ్రమకు మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి సరికొత్త స్థాయికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.