తెలంగాణ

జూన్‌లో రైతుబంధు నిధుల చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం కింద 2019 వానాకాలం డబ్బును జూన్ రెండోవారంలోగా చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక్కో ఎకరానికి ఐదువేల రూపాయల చొప్పున చెల్లించేందుకు కసరత్తు జరుగుతోంది. రైతుబంధుకోసం ఓట్ అన్ అకౌంట్‌లో 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉండటం వల్ల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని అధికార వర్గాలు వివరించాయి. 2018-19 సంవత్సరానికి సంబంధించి యాసంగిలో 52 లక్షల మంది రైతులకు రైతుబంధు డబ్బును చెల్లించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. యాసంగిలో బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడని వారి విషయంలో అవసరమైన శ్రద్ద తీసుకునేందుకు ఆర్థిక శాఖ సమ్మతించింది. రైతు రుణమాఫీకి ఓట్ అన్ అకౌంట్‌లో మూడువేల కోట్ల రూపాలయలు కేటాయించగా, త్వరలోనే ఈ నిధులు విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.