తెలంగాణ

‘ఉన్నత’ శిఖరాలకు తెలంగాణ విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం వికాసం భేష్ అని కర్నాటక ఉన్నత విద్యాశాఖ అధికారులు, నేక్ అధికారులు పేర్కొన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం బెంగలూరులోని ఉన్నత విద్యామండలిని, నేక్ కార్యాలయాన్ని సందర్శించింది. బృందంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌లు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వీ వెంకటరమణ ఉన్నారు. వీరు నేక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్‌సీ శర్మను, సలహాదారు ప్రొఫెసర్ లతాపిళ్లైని కలిశారు. ఈ సందర్భంగా ప్రతినిధి బృందం సభ్యులు తెలంగాణ ఉన్నత విద్యలో చేపట్టిన సంస్కరణలు, ఐసీటీ వినియోగం, ప్రవేశ పరీక్షలకు, అడ్మిషన్లకూ ఆన్‌లైన్ వినియోగిస్తున్న తీరును, కాలేజీలు, సీట్లు, ప్రమాణాలు, అనుబంధ గుర్తింపు విషయంలో అనుసరిస్తున్న విధానాలను వారికి వివరించారు. అలాగే నేషనల్ అక్రిడిటేషన్, అసెస్‌మెంట్ కౌన్సిల్ సహకారంతో జూలైలో హైదరాబాద్‌లో యాజమాన్యాలకు, విద్యాపాలకులకు వర్కుషాప్ నిర్వహించాల్సిందిగా ప్రతినిధి బృందం నేక్ డైరెక్టర్‌ను కోరారు. అక్రిడిటేషన్‌పై అందరికీ చైతన్య కార్యక్రమం నిర్వహించాలని ప్రొఫెసర్ పాపిరెడ్డి వారిని కోరారు. ప్రమాణాలు పెంపునకు ఉన్నత విద్యామండలి చేపట్టిన చర్యలపై నేక్ డైరెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతకు ఉపాధిని పెంచేందుకు కౌన్సిల్ తీసుకుంటున్న చర్యలు వినూత్నంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. కర్నాటక ఉన్నత విద్యామండలి మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ ఎస్‌కే కోరిని తెలంగాణ బృందం కలిసింది. ఈ కార్యక్రమంలో బెంగలూరు యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జనార్ధనం, బెంగలూరు సెంట్రల్ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్ జపేట్ పాల్గొన్నారు.

చిత్రం... బెంగళూరులోని నేక్ ఉన్నతాధికారులతో తెలంగాణ విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తదితరులు