తెలంగాణ

ఎడ్‌సెట్ నిర్వహణకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: తెలంగాణలో 31వ తేదీన ఎడ్‌సెట్ నిర్వహణకు సర్వంసిద్ధం చేశామని కన్వీనర్ ప్రొఫెసర్ టీ మృణాళిని తెలిపారు. ఉదయం 10 నుండి 12 గంటల వరకూ, మధ్యాహ్నం 3.30 నుండి 5.30 గంటల వరకూ జరుగుతుందని చెప్పారు. పరీక్ష సమయాల్లో స్వల్ప మార్పు చేశామని దానిని అభ్యర్ధులు గుర్తించాలని ఆమె సూచించారు. సోషల్ స్టడీస్, ఇంగ్లీషు, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులకు ఉదయం పూట, మాథమెటిక్స్, బయలాజికల్ సైనె్సస్‌కు సాయంత్రం పూట పరీక్ష జరుగుతుందని ఆమె వివరించారు. అభ్యర్ధుల హాల్‌టిక్కెట్లను ఎడ్‌సెట్ పోర్టల్‌లో ఉంచామని, 23వ తేదీ నుండి అభ్యర్థులు హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అన్నారు. పరీక్ష కేంద్రాలకు 90 నిమిషాల ముందే చేరుకోవాలని ఆమె సూచించారు. ఉదయం సెషన్ పరీక్ష రాసే వారు 8.30 గంటలకు, సాయంత్రం పరీక్ష రాసే వారు 2 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. 52,380 మంది అభ్యర్ధులు రిజిస్టర్ చేసుకున్నారని అందులో 12,458 మంది పురుషులు, 9,922 మంది మహిళలు అన్నారని అన్నారు. వీరికోసం తెలంగాణలో 80 టెస్టు సెంటర్లు పెట్టామని అన్నారు. ఆంధ్రాలో మూడు టెస్టు సెంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు. ఉదయం సెషన్‌లో 24,885 మంది, సాయంత్రం 27,522 మంది హాజరవుతున్నారని ప్రొఫెసర్ మృణాళిని తెలిపారు.