తెలంగాణ

పరిషత్ ఫలితాలు రాగానే చైర్మన్ల నోటిఫికేషన్ ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: రాష్ట్ర ఎన్నికల సంఘం పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మర్నాడే మండల జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయాలని బీజేపీ రాష్ట్ర నేతలు ఎన్నికల సంఘం కమిషనర్ వీ నాగిరెడ్డిని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో శాసనమండలి పక్ష నేత ఎస్ రాంచందర్ రావు, ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జీ మనోహర్ రెడ్డిని ఎన్నికల కమిషనర్‌ను బుధవారం కలిశారు. ఈ ఎన్నికల్లో అవినీతి, అక్రమాలు, అధికారం, ధనం , కండబలాల ప్రభావం పడకుండా ఎన్నికలు నిర్వహించే సువర్ణ అవకాశాన్ని ఎన్నికల సంఘం సద్వినియోగం చేసుకోవాలన్నారు. పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం జిల్లా , మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల నిర్వహణకు మూడు రోజుల గడువుతో నోటిఫికేషన్ ఇవ్వవచ్చన్నారు. ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసిన పక్షంలో ఎన్నికల్లో ఎలాంటి బేరసారాలు, ప్రలోభాలు, వత్తిడులకు అవకాశం ఉండదన్నారు. జూలై 5వ తేదీ తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఉంటాయని వార్తలు రావడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుత పాలకవర్గాలకు మరో నెల రోజులు గడువు ఉన్నా, ఈ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వాతావరణంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రకరకాల ప్రలోభాలు, వత్తిళ్లతో పార్టీలు మారుతున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. బ్లాక్ మెయిల్, బెదిరింపులు, డబ్బు సంచులతో స్థానిక ప్రజా ప్రతినిధులను పార్టీ ఫిరాయింపచేస్తారని అన్ని వర్గాల్లో భయం, ఆందోళన నెలకొని ఉందన్నారు. ఎన్నికల జాప్యంతో స్థానిక ప్రజాప్రతినిధులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు.