తెలంగాణ

టీఆర్‌ఎస్ మద్దతు అవసరమైతే ప్రభుత్వంలో భాగస్వామ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: నేడు వెలువడనున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. ఎవరి మద్దతు అవసరం లేకుండా కేంద్రంలో ఎన్డీయే కూటమి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పక్షంలో టీఆర్‌ఎస్ ఎప్పటి మాదిరిగానే రాష్ట్రానికే పరిమితం కానుంది. అలా కాకుండా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే టీఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించబోతుంది. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో ‘మీ ఎంపి వినోద్‌కుమార్ కేంద్ర మంత్రి కాబోతున్నారు’ అని స్వయంగా టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ ఎంపీ కేంద్ర మంత్రి అవుతారంటే, కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో టీఆర్‌ఎస్ భాగస్వామ్యం కాబోతున్నట్టే లెక్క. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ రెండింటికి ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడ మెజారిటీ రాదని, అక్కడ ఏర్పడేది సంకీర్ణ ప్రభుత్వమేనని టీఆర్‌ఎస్ గట్టి నమ్మకంగా ఉంది. కేంద్రంలో ఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా సాధ్యం కాదన్నది కూడా టీఆర్‌ఏస్ వాదన. ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు మెజారిటీ రానిపక్షంలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించి రాష్ట్ర ప్రయోజనాల కోసం అందులో భాగస్వామ్యం కానున్నట్టు ఎన్నికల ప్రచార సభల్లోనే టీఆర్‌ఎస్ తన వైఖరిని స్పష్టం చేసింది.
ఈ లెక్కన కేంద్రంలో హంగ్ ఏర్పడితే మద్దతు ఇచ్చి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలన్నది టీఆర్‌ఎస్ ఆలోచన. ఆ పరిస్థితి వస్తే టీఆర్‌ఎస్ నుంచి కేంద్ర మంత్రి అయ్యేది ఎవరనే వివాదానికి తావు లేకుండా వినోద్‌కుమార్‌కే అవకాశం ఉంటుందని కేసీఆర్ ముందుగానే ప్రకటించారు. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థులలో వినోద్‌కుమారే సీనియర్. ఈయన కంటే మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి సీనియర్ అయినప్పటికీ ఎన్నికల ముందు ఆయన బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఏన్డీయే కూటమినే తిరిగి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. ఎన్డీయేకు సరిపడ మెజారిటీ రానిపక్షంలో దానికి టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందా? లేక వెలుపలి నుంచి మద్దతు ఇచ్చి లౌకిక పార్టీ ముద్రను కాపాడుకుంటుందా? లేదా అనేది తేలాల్సి ఉంది. ఎన్డీయేకు టీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చే పక్షంలో ఇంతకాలం మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీ ఏ వైఖరి ఎలా ఉంటుందన్నది కూడా ప్రశే్న. ఇలా ఉండగా పార్లమెంట్ ఫలితాలు వెల్లడయ్యాక కేంద్రంలో హంగ్ ఏర్పడే పరిస్థితి ఉత్పన్నమైతే గురువారం సాయంత్రమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఫలితాల తదనంతర సమీకరణలపై తనతో కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలతో కేసీఆర్ మంతనాలు సాగిస్తోన్నట్టు తెలిసింది.