తెలంగాణ

మాకు మంచి ఫలితాలొస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 22: ఎగ్జిట్ పోల్స్ అంఛనాలకు భిన్నంగా దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు రాబోతున్నాయని పీసీసీ చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండలోని బండారు గార్డెన్‌లో నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌లో పాల్గొనే పార్టీ ఏజెంట్ల శిక్షణా సదస్సుకు హాజరై ఆయన మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని నిజం కావని, ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటింగ్ చేసినట్లుగా భావిస్తున్నామన్నారు. ఈవీఎంల పనితీరుపై దేశ వ్యాప్తంగా సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో కాంగ్రెస్ ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియలో అనుక్షణం అప్రమత్తంగా వ్యవహారించాలన్నారు. ఉదయం స్ట్రాంగ్ రూమ్‌ల నుండి ఈవీఎంలను కౌంటింగ్ హాల్‌కు తీసుకువచ్చిన సందర్భంగా ఈవీఎంలలో పోలింగ్ ప్రారంభం, ముగింపు సమయాలను పరిశీలించాలన్నారు. ఏవైనా ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తినా, పోలైన ఓట్లకు, లెక్కింపు ఓట్లకు తేడా వచ్చినా, అలాగే వీవీ ప్యాట్ల నుండి లెక్కించిన ఓట్లకు, ఈవీఎంల ఓట్లకు తేడాలున్నా వెంటనే అధికారుల నుండి సందేహ నివృత్తి జరిగే వరకు కౌంటింగ్ ప్రక్రియను నిలుపదల చేయించాలన్నారు. పోలైన ఓట్లకు, లెక్కింపు ఓట్లకు భారీ వ్యత్యాసం ఉంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లుగా భావించి న్యాయం జరిగే వరకు వివిధ స్థాయిల్లో పోరాటం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సంసిద్ధం కావాలన్నారు. ఈ సమావేశంలో పీసీసీ కార్యదర్శి నిరంజన్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్. బాలునాయక్, డీసీసీ అధ్యక్షులు శంకర్‌నాయక్, పీసీసీ నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.