తెలంగాణ

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీఆర్‌ఎస్ -9, బీజేపీకి -4, కాంగ్రెస్-3, ఎంఐఎం-1
*
హైదరాబాద్, మే 23: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను టీఆర్‌ఎస్ తొమ్మిది స్థానాల్లో, బిజేపీ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధించాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి సోయం బాబూరావు టీఆర్‌ఎస్ అభ్యర్థి గడ్డం నగేష్‌పై 58,483 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్ నేత కాంగ్రెస్ అభ్యిర్థి ఏ. చంద్రశేఖర్‌పై విజయం సాధించారు. కరీంనగర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌పై 89,508 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నిజామాబాద్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్, టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితపై విజయం సాధించారు. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్, కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్‌రావుపై విజయం సాధించారు. మెదక్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌పై 3,16,427 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఏ. రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రిరాజశేఖరరెడ్డిపై విజయం సాధించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి జీ. కిషన్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్‌పై విజయం సాధించారు. హైదరాబాద్‌లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తన సమీప బీజేపీ అభ్యర్థి భగవంతరావుపై విజయం సాధించారు. చేవెళ్ల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ జి. రంజీత్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశే్వశ్వర్‌రెడ్డిపై విజయం సాధించారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మనె్న శ్రీనివాస్‌రెడ్డి బీజేపీ అభ్యర్థి డికే అరుణపై 77,829 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. నాగర్‌కకర్నూల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవిపై 1,89,748 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్తి ఉత్తంకుమార్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై 25,682 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి బూరా నర్సయ్యగౌడ్‌పై 4,943 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. వరంగల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ కాంగ్రెస్ అభ్యర్తి దొమ్మాటి సాంబయ్యంపై 3,50,298 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత మలోతు కాంగ్రెస్ అభ్యర్థి పొరిక బల్‌రాం నాయక్‌పై 1,46,663 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఖమ్మం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.
*
నియోజకవర్గం గెలిచిన అభ్యర్థి (పార్టీ) ఓడిన అభ్యర్థి (పార్టీ) మెజారిటీ
*
ఆదిలాబాద్ సోయంబాబురావు (బీజేపీ) గడ్డం నగేశ్ (టీఆర్‌ఎస్) 58,493
హైదరాబాద్ అసదుద్దీన్‌ఒవైసీ (ఎంఐఎం) భగవంతరావు (బీజేపీ) 2,82,186
కరీంనగర్ బండి సంజయ్‌కుమార్ (బీజేపీ) వినోద్‌కుమార్ (టీఆర్‌ఎస్) 89,508
ఖమ్మం నాగేశ్వరరావు (టీఆర్‌ఎస్) రేణుకాచౌదరి (కాంగ్రెస్) 1,68,062
మహబూబాబాద్ కవిత (టీఆర్‌ఎస్) బల్‌రాంనాయక్ (కాంగ్రెస్) 1,46,663
మహబూబ్‌నగర్ మనె్నశ్రీనివాస్‌రెడ్డి (టీఆర్‌ఎస్) డీకేఅరుణ (బీజేపీ) 77,829
మెదక్ కొత్తప్రభాకర్‌రెడ్డి (టీఆర్‌ఎస్) అనిల్‌కుమార్ (కాంగ్రెస్) 3,16,427
నాగర్‌కర్నూల్ పి.రాములు (టీఆర్‌ఎస్) మల్లు రవి (కాంగ్రెస్) 1,89,748
నల్లగొండ ఉత్తం కుమార్‌రెడ్డి (కాంగ్రెస్) నర్సింహారెడ్డి (టీఆర్‌ఎస్) 25,682
పెద్దపల్లి నేతవెంకటేశ్ (టీఆర్‌ఎస్) చంద్రశేఖర్ (కాంగ్రెస్) 95,180
సికింద్రాబాద్ జి.కిషన్‌రెడ్డి (బీజేపీ) తలసాని సాయికిరణ్ (టీఆర్‌ఎస్) 62,114
వరంగల్ పసునూరి దయాకర్ (టీఆర్‌ఎస్) దొమ్మాటి సాంబయ్య (కాంగ్రెస్) 3,50,298
భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్) బూరానర్సయ్యగౌడ్ (టీఆర్‌ఎస్) 5219
నిజామాబాద్ ధర్మపురి అర్వింద్ (బీజేపీ) కల్వకుంట్ల కవిత (టీఆర్‌ఎస్) 71,057
జహీరాబాద్ బీబీపాటిల్ (టీఆర్‌ఎస్) మదన్‌మోహన్‌రావు (కాంగ్రెస్) 6,229
మల్కాజిగిరి రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్) రాజశేఖరరెడ్డి (టీఆర్‌ఎస్) 10,919
చేవెళ్ల రంజిత్‌రెడ్డి (టీఆర్‌ఎస్) కొండావిశే్వశ్వర్‌రెడ్డి (కాంగ్రెస్) 16,800
*
చిత్రం...మల్కాజ్‌గిరి నుంచి గెలిచిన రేవంత్‌రెడ్డి విజయోత్సవం