తెలంగాణ

టీఆర్‌టీలను తక్షణమే నియమించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌టీల నియామకాలు వెంటనే చేపట్టాలని తెలంగాణ టీచర్సు ఫెడరేషన్ అధ్యక్షుడు ఈ రఘునందన్, ప్రధాన కార్యదర్శి కే రమణలు కోరారు. టీఆర్‌టీల ఎంపికకు 2017లో నోటిఫికేషన్ ఇచ్చారని , కనీసం ఈ ఏడాది స్కూళ్లు తెరిచే నాటికి నియామకాలు చేపడతారని చూస్తే అందుకు సంబంధించి ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఐదుగురు ఎంపికైన టీఆర్‌టీ అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క టీచర్ నియామకం జరగలేదని, ఇది చాలా దారుణమని వారు పేర్కొన్నారు. రాష్టక్రార్యాలయంలో జరిగిన కమిటీ సమావేశంలో రఘనందన్ మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేసి, ఒపీఎస్ పునరుద్ధరించాలని, ఎంత మాత్రం జాప్యం చేయకుండా పీఆర్‌సీ, మధ్యంతర భృతిని ప్రకటించలని అన్నారు. పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని, స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని అన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు వెంటనే చేపట్టాలని ఆయన కోరారు.