తెలంగాణ

2న ఇంటర్ ‘బాధిత’ కుటుంబాల వౌనదీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: ఇంటర్మీడియట్ ఫలితాల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫలితాలు చూసి చలించిపోయి ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబీకులను ఆదుకోవాలని సీపీఐ నేత డాక్టర్ డీ సుధాకర్ కోరారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్ 2వ తేదీ నుండి సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్ద వౌన దీక్ష చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబీకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఒక బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి కార్యాలయ అధికారులను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. మూడు పేజీల వినతిపత్రంలో ఈ ఏడాది ఇంటర్ ఫలితాలకు సంబంధించి జరిగిన అక్రమాలు, అవతకవకల గురించి వారు వివరించారు. ప్రతి బాధిత కుటుంబానికీ 50 లక్షల రూపాయిలు చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. అక్రమాలకు బాధ్యులైన బోర్డు అధికారులను , కార్యదర్శిని సస్పెండ్ చేయాలని , సిట్టింగ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించాలని , గ్లోబరీనా సంస్థపైనా చర్యలు చేపట్టాలని , విద్యా మంత్రి జగదీష్‌రెడ్డిని పదవి నుండి తొలగించాలని వారు కోరారు. ఆత్మహత్యలకు పాల్పడిన ఏ అనామిక సోదరి ఏ ఉదయ, ఏ నాగేందర్ తండ్రి డీ శ్రీనివాసరావు, మహేశ్వరి తల్లి సరస్వతి, ఎస్ జ్యోతి సోదరి ఎస్ వీరేష్, పీఎస్ అనురాగ్ తల్లి పీఎస్ షాలినీతో పాటు కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ఎంఆర్‌జీ వినోద్‌కుమార్, రామన్‌సింగ్ సీఎస్‌ను కలిశారు.