తెలంగాణ

పరిషత్ ఓట్ల కౌంటింగ్ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి ఎం. అశోక్ కుమార్ పేరుతో శనివారం ఇక్కడ పత్రికా ప్రకటన జారీ చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఆయన వివరించారు.
ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డిని ఇటీవల వివిధ రాజకీయ పక్షాల నేతలు కలిసి ఒక వినతిపత్రం ఇచ్చారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు పూర్తి అయిన వెంటనే ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జడ్పీపీ చైర్‌పర్సన్, వైస్-చైర్‌పర్సన్‌ల ఎన్నికలు చేపట్టాలని నాగిరెడ్డిని వారు కోరారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు, అధ్యక్ష, చైర్‌పర్సన్ల ఎన్నికల మధ్య గడువు తక్కువగా ఉండాలని కోరారు. ఈ గడువు ఎక్కువగా ఉంటే అధ్యక్ష స్థానం, చైర్‌పర్సన్ స్థానం ఆశించేవారు ఎన్నికైన ప్రాదేశిక సభ్యులను క్యాంపులకు తరలించే అవకాశం ఉందని, పార్టీలు మార్చేందుకు అవకాశం ఇచ్చినట్టవుతుందని వివరించారు. ఈ కారణంగా గడువు తక్కువగా ఉండేలా చూడాలని కోరారు. ఈ కోరికను దృష్టిలో ఉంచుకుని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు తేదీని కమిషన్ వాయిదా వేసింది.
ఇలా ఉండగా ఎంపీపీ, జడ్పీపీ మొదటి సమావేశాలను నిర్వహించేందుకు ప్రస్తుతం ఉన్న నియమావళిలో మార్పులు, చేర్పులు చేయాలని ఎన్నికల కమిషన్ ఇటీవలే ప్రభుత్వానికి సూచించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రత్యక్షమైనవని, ప్రజలే నేరుగా జిల్లాపరిషత్ ప్రాదేశిక సభ్యులను, మండలపరిషత్ ప్రాదేశిక సభ్యులను ఎన్నుకుంటారని గుర్తు చేశారు. జడ్పీపీ చైర్‌పర్సన్, వైస్-చైర్‌పర్సన్, ఎంపీపీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల ఎన్నికలు పరోక్ష విధానంలో జరుగుతాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రాదేశిక సభ్యులు చేతులెత్తి ఎన్నుకుంటారు. ఒక పార్టీ నుండి గెలిచిన సభ్యులను మరొక పార్టీవారు ప్రలోభపెట్టి క్యాంపులకు తరలించి, పరోక్ష ఎన్నికల సమయంలో ఎన్నికల కేంద్రానికి తీసుకువస్తారు. ఈ కారణంగానే ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు, జడ్పీపీ చైర్‌పర్సన్, వైస్-చైర్‌పర్సన్ ఎన్నికల కోసం తొలి సమావేశాలు నిర్వహించే తేదీలను ప్రభుత్వం ప్రకటించారని కోరారు. ఆ తర్వాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతామని వెల్లడించారు.