తెలంగాణ

సీపీఐ తొలి ప్రధాన కార్యదర్శి పీపీసీ జోషి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: తొలి తరంలో సీపీఐ మొదటి జనరల్ సెక్రటరీగాపని చేసిన పీపీసీ జోషి అనారోగ్యంతో ఆదివారం హైదరాబాద్‌లో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన నివాసంలో ఉంటున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సురవరం తెలిపారు. కామ్రేడ్ జోషితో తనకు విద్యార్థి దశ నుంచి బాగా పరిచయం ఉందన్నారు.
జోషి తండ్రి తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులయ్యారని ఆయన గుర్తు చేశారు. సీపీఐకి మొదటి జనరల్ సెక్రటరీగా పని చేసిన కామ్రేడ్ పీపీసీ జోషి గారిని స్ఫూర్తిగా తీసుకుని తన కుమారునికి పీసీ జోషిగా నామకరణం చేశారన్నారు. జోషి సీపీఐ కోసం అనేక పదవులు చేపట్టారాన్నారు. జోషి గారికి పుస్తక ప్రచురణ బాగా ఆసక్తిగా ఉండేదన్నారు. ప్రాచీ పబ్లికేషన్ స్థాపించి మంచి పుస్తకాలు ప్రచురించారన్నారు. జోషి సతీమణి లలితాజోషి కుటుంబ సభ్యులకు సానుభూతని వ్యక్తం చేస్తున్నట్లు సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు.