తెలంగాణ

రేవంత్ విజయ రహస్యమిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: టీఆర్‌ఎస్‌కు రేవంత్ రెడ్డి కంట్లో నలుసు. కొడంగల్‌లో టీఆర్‌ఎస్ అన్ని శక్తులు, రాజనీతి తంత్రం ప్రయోగిం చి రేవంత్‌ను ఓడించింది. అలాంటి రేవంత్ పూర్తిగా మెట్రోనగరమైన హైదరాబాద్‌లో భాగమైన మల్కాజగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగారు. సైలెంట్‌గా ప్రచారం చేశారు. ఎలాంటి హడావుడి లేదు. 30 లక్షల ఓటర్లు ఉన్న మల్కాజగిరిలో వ్యూహాత్మంగా పావులు కదిపి పర్యటించి టీఆర్‌ఎస్ బలహీనతలపై దెబ్బకొట్టారు. దీనికి తోడు లక్షల సంఖ్యలో ఓటర్లు ఆంధ్రా, తెలంగాణలో ఇతర జి ల్లాలకు ఓట్లు వేసేందుకు తరలివెళ్లారు. ఇదే రేవంత్‌కు ప్లస్ పాయింట్‌గా పరిణమించింది. పైగా రేవంత్ రెడ్డి తన సామాజికవర్గం వారు బాగా ఇష్టపడే వైకాపాను, జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేదు. ఎక్కడా నోరు జారకుండా జాగ్రత్తపడ్డారు. ఇవన్నీ కలిసివచ్చాయి.
మల్కాజగిరి లోక్‌సభ సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి గెలిచేందుకు నియోజకవర్గం పరిధిలో ఉన్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అసమర్థత, సమన్వయలోపం కారణమని చెప్పవచ్చు. మల్కాజగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో దాదాపు 30లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. దేశంలో అతి పెద్ద నియోజకవర్గంగా మల్కాజగిరి పేరు తెచ్చుకుంది. ఈ నియోజకవర్గంలో మల్కాజగిరి, కుకుట్‌పల్లి, కు త్బుల్లాపూర్, ఎల్‌బీనగర్, ఉప్పల్, మేడ్చెల్, సికింద్రాబాద్ కంటోనె్మంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌బీ నగరర్ మినహా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ మంచి మెజార్టీతో నెగ్గింది. ఈ నియోజకవర్గంలో ఆంధ్ర ప్రాం తం నుంచి వలస వచ్చి స్థిరపడిన ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉన్నా రు. ప్రధానంగా కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, కుకుట్‌పల్లి నియోజకవర్గాల్లో వీరి సంఖ్య ఎక్కువ. ఏప్రిల్ 11వ తేదీ రోజు ఆంధ్రరాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు జరగడంతో దాదాపు 3లక్షల మంది ప్రజలు ఓటు వేసేందుకు వెళ్లారు. వీరు ఇక్కడా ఓటరుగా నమోదై ఉన్నారు. అలాగే తెలంగాణ ప్రాంతంలో అనేక జిల్లాలకు ఇక్కడి నుంచి ప్రజలు ఓట్లువేసేందుకు వెళ్లారు. దీంతో టీఆర్‌ఎస్‌కు భారీగా నష్టం వాటిల్లింది. కుత్బుల్లాపూర్, కుకుట్‌పల్లి, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయలేదని నివేదికలు పార్టీ అధినాయకత్వానికి ఇప్పటికే అందినట్లు తెలుస్తోంది.